వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు 420-ఉమ పెద్ద బ్రోకర్: రేణుకపైనా జగన్ పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్. ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్. ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనుండటంతో ఓర్వలేకే టీడీపీ మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

ఇరిగేషన్‌పై తెలంగాణలో ఒక మాదిరిగా, ఆంధ్రాలో మరోలా టీడీపీ మాట్లాడుతోందని విమర్శించారు. నేటి పట్టిసీమ ఆనాడు దివంగత మహానేత వైయస్‌ తవ్వించిన కుడి కాలువ వల్లే సాధ్యమైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

మంత్రి ఉమ పెద్ద బ్రోకర్..

మంత్రి ఉమ పెద్ద బ్రోకర్..

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే... నీరు, రైతులు, పంటలు, సేద్యం గురించి తెలియదంటూ మంత్రులు పిచ్చిపిచ్చి వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
పట్టిసీమ తానే తెచ్చానని చెబుతున్న మంత్రి దేవినేని ఉమా పెద్ద బ్రోకర్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జోగి రమేష్.

ఏపీలో ఒకలా.. టీడీపీలో మరోలా..

ఏపీలో ఒకలా.. టీడీపీలో మరోలా..

ఇరిగేషన్‌పై తెలంగాణలో ఒక మాదిరిగా, ఆంధ్రాలో మరోలా టీడీపీ మాట్లాడుతోందని విమర్శించారు. నేటి పట్టిసీమ ఆనాడు దివంగత మహానేత వైయస్‌ తవ్వించిన కుడి కాలువ వల్లే సాధ్యమైందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్లకు, చంద్రబాబుకు, లోకేష్‌కు మధ్య మంత్రి దేవినేని ఉమా బ్రోకర్‌గా పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

420 ఎవరో తెలుసు..

420 ఎవరో తెలుసు..

ఆఖరికి అర్ధరాత్రి మంత్రి పదవి తెచ్చుకున్న బీర్‌ హెల్త్‌ డ్రింక్‌ అని చెప్పే మంత్రి జవహర్‌ కూడా జగన్‌ పాదయాత్ర పేరు 420 పెట్టి సినిమా తీయమని చెబుతుండడాన్ని జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఏ పిల్లాడ్ని అడిగినా ఖచ్చింగా చంద్రబాబు-420 అని చెబుతారని ఎద్దేవా చేశారు. రాంగోపాల్‌వర్మ తీసే సినిమాతో చంద్రబాబుకు, ఆయన మంత్రులకు భయం పట్టుకుందని తెలిపారు.
ఎన్టీఆర్‌ చరిత్ర సినిమాలో విలన్‌గా 420 చంద్రబాబుని పెట్టి తీయాలని, అప్పుడే ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందని పేర్కొన్నారు.

ఆ మంత్రి ప్రాధాన్యతా..?

ఆ మంత్రి ప్రాధాన్యతా..?

కాగా, కార్పొరేట్‌ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై చర్యలు తీసుకునే నాథుడే లేడని జోగి అన్నారు. రాష్ట్రంలో 10 రోజుల్లో 8 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోవడానికి మంత్రి నారాయణే కారణమని, చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుట్టా రేణుక పార్టీ ఎందుకు మారారు?

బుట్టా రేణుక పార్టీ ఎందుకు మారారు?

ఎంపీ బుట్టా రేణుక ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారో కర్నూలు ప్రజలకు సమాధానం చెప్పాలని జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని బుట్టా రేణుకకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది వైసీపీనే అన్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘జగనన్న చలవ వల్లే నేను ఎంపీగా గెలిచానన్న బుట్టా రేణుక ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని టీడీపీలో చేరారు' అని జోగి రమేష్‌ ప్రశ్నించారు. ‘కర్నూలులో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారని పార్టీ మారారా? లేక బలహీన వర్గాలకు చంద్రబాబు మేలు చేశారనా?. మీకు రూ.70 కోట్ల ప్యాకేజీ అందిందని ప్రజలంతా అనుకుంటున్నారు ...అందుకు మారారా?' అని ప్రశ్నించారు. అంతేగాక, ఎమ్మెల్యే, ఎంపీల కొనుగోలుపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ‘అందరు తిడుతుంటే చంద్రబాబు మారారు అనుకున్నాం, కానీ మారలేదు' అని ఎద్దేవా చేశారు.

English summary
YSRCP leader Jogi Ramesh on Monday fired at Andhra Pradesh CM Chandrababu Naidu and his ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X