విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు, వదిలేయలేదు: జోగి రమేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జోగి రమేష్ అన్నారు. హోదా కోసం గతంలో తాము ఎన్నో పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు.

ప్రత్యేక హోదా సాధనే జగన్ ధ్యేయమని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. సిపిఐ నేత రామకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతగా కాకుండా చంద్రాబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మాట్లాడుతున్నారని అన్నారు.

Jogi Ramesh says YS Jagan words twisted

రామకృష్ణ దిగజారి మాట్లాడడం దారుణమని ఆయన అన్నారు. చంద్రబాబు తానా అంటే ఈయన తందానా అనడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబుకు రామకృష్ణ తొత్తుగా మారారాని వ్యాఖ్యానించారు.

వైయస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రామకృష్ణ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రామకృష్ణ చంద్రబాబుకు అమ్ముడుపోయారని అనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి సిగ్గశెరం లేకుండా మాట్లాడాతన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు అంబోతులా బలిి మాట్లాడితే కామినేని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆదినారాయణ రెడ్డి మతి తప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader Jogi Ramesh condemned comments of CPI leader Ramakrishna made against YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X