వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు షాక్, డీలాపడ్డ జగన్ ఇలా: అసెంబ్లీ బాధ్యత పెద్దిరెడ్డికి, బడ్జెట్‌కు రావాల్సిందే

పాదయాత్ర నేపథ్యంలో తనకు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వైసిపి అధినేత జగన్ పిటిషన్‌నను సిబిఐ కోర్టు సోమవారం తోసిపుచ్చింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పాదయాత్ర నేపథ్యంలో తనకు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వైసిపి అధినేత జగన్ పిటిషన్‌నను సిబిఐ కోర్టు సోమవారం తోసిపుచ్చింది.

జగన్‌కు గట్టి షాక్: బెయిల్ సందర్భంలో.. నాలుగేళ్లకు తప్పుదిద్దుకున్న సిబిఐ! జగన్‌కు గట్టి షాక్: బెయిల్ సందర్భంలో.. నాలుగేళ్లకు తప్పుదిద్దుకున్న సిబిఐ!

ఆయనకు న్యాయస్థానం షాకిచ్చింది. సిబిఐ కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని జగన్, వైసిపి కేడర్ భావించింది. కానీ న్యాయస్థానం మాత్రం ఆయన పిటిషన్‌కు నో చెప్పింది.

 ఢీలాపడ్డ జగన్

ఢీలాపడ్డ జగన్

కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో జగన్ ఢీలాపడ్డారు. సోమవారం జరగాల్సిన వైసిపి ఎల్పీ సమావేశాన్ని రద్దు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పాదయాత్రపై ఏం చేయాలనే దానిపై చర్చించారని తెలుస్తోంది.

కోర్టు తీర్పు.. ఏం చేద్దామని పార్టీ నేతలతో జగన్

కోర్టు తీర్పు.. ఏం చేద్దామని పార్టీ నేతలతో జగన్

తీర్పు నేపథ్యంలో ఏం చేస్తే బాగుటుందో పార్టీ నేతలను జగన్ అడిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. నవంబర్ 2 నుంచి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర ఆరు నెలలు చేయనున్నారు.

 బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాల్సిందే

బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాల్సిందే

ఈ సమయంలోనే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నవంబర్ రెండవ వారం నుంచి శీతాకాల సమావేశాలు, ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాలకు జగన్ తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

 శీతాకాల సమావేశాల బాధ్యతలు పెద్దిరెడ్డికి

శీతాకాల సమావేశాల బాధ్యతలు పెద్దిరెడ్డికి

అటు కోర్టు తీర్పు ఇటు పాదయాత్ర కారణంగా బిజీగా ఉన్న తరుణంలో జగన్ వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం అనుమానంగా ఉంది. అందుకే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సీబీఐ కోర్టు సవాలు చేస్తూ జగన్ హైకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 న్యాయస్థానం కొట్టివేసింది

న్యాయస్థానం కొట్టివేసింది

జగన్ పిటిషన్ విషయమై సిబిఐ కోర్టు తీర్పుపై వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పందించారు. జగన్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అలాగే అసెంబ్లీకి జగన్ హాజరయ్యే విషయమై కూడా చర్చిస్తున్నామని చెప్పారు.

English summary
The CBI Court has quashed the petition of YS Jagan Mohan Reddy, a key accused in quid-pro-quo and DA cases, seeking permission for his absence from the investigation in order to participate in Padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X