వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది సామీ’: జగన్‌పై మహేశ్ బాబు సినిమా డైలాగ్స్‌తో ఎమ్మెల్యే పద్మావతి

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేసి తీరుతారని వ్యాఖ్యానించారు.

నీ మాట శాసనం..

నీ మాట శాసనం..

‘నువ్వు అనుకుంటే అవుద్ది స్వామీ.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం' అంటూ ఎమ్మెల్యే పద్మావతి ఓ సినిమా డైలాగ్ చెబుతూ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా' సినిమాలో ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపుతున్నారని ఆమె చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాదనడం సరికాదని అన్నారు.

నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్..

నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్..


ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డ్రామాలు ‘నెవర్ బిఫోర్.. నెవర్ ఆప్టర్' అంటూ తాజాగా విడుదలైన మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ'లోని డైలాగ్ చెప్పడం గమనార్హం. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లీష్ రెండూ రావడం లేదని సెటైర్లు వేశారు.

చంద్రబాబు మనవడు ఏ మీడియం

చంద్రబాబు మనవడు ఏ మీడియం

మరో ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియం వద్దన్నంటున్న నాయకుల పిల్లలు ఏ మీడియంలో చదుతున్నారో చెప్పాలన్నారు. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు.. తన మనవడ్ని ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి ఎమ్మెల్యే ఉషాచరణ్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయాలనే సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు.

విద్యా చట్టం ఆమోదం.. ఆవశ్యకతపై జగన్..

విద్యా చట్టం ఆమోదం.. ఆవశ్యకతపై జగన్..


కాగా, ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు అసెంబ్లీలో వీగిపోయాయి. ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పేదవారు కూడా రాణించాలంటే ఇంగ్లీష్ మీడయం అవసరమని అన్నారు. పేద విద్యార్థుల కోసమే రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చామని తెలిపారు. విద్యా కానుక పథకం కింద రూ. 1350ల విలువైన కిట్ ను విద్యార్థులకు అందిస్తున్నామని, జూన్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు. పేదవారికి మేలు చేసే ఇంగ్లీష్ మీడియం బిల్లును మండలిలో అడ్డుకున్నారని మండిపడ్డారు. సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పిపంపారని, అయితే, మళ్లీ ఇక్కడ ఆ బిల్లును ఆమోదిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ మండలికి పంపుతున్నామని.. అసెంబ్లీలో ఆమోదం పొందితే మండలిలో అడ్డుకోవడానికి ఏమీ ఉండదని సీఎం జగన్ చెప్పారు. ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకతను వివరించారు.

English summary
YSRCP MLA jonnalagadda padmavathi praises cm ys jagan with cinema dialogues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X