వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ శివప్రసాద్ కిడ్నాప్: నోటీసులు ఇవ్వకుండా, వారెంట్ లేకుండా: లోకేశ్..

|
Google Oneindia TeluguNews

జర్నలిస్టు శివప్రసాద్‌ను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా హైదరాబాదులో గల ఇంటి నుంచి తీసుకెళ్లారని లోకేశ్ ఆరోపించారు. ఇంతకీ శివప్రసాద్ చేసిన తప్పేంటీ అని ప్రశ్నించారు. ఏంచేశాడని శివప్రసాద్ ను తీసుకెళ్లారు? అతను ఏపీ ప్రభుత్వ విధానాలను తప్పుపడితే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు.

శివప్రసాద్ నుంచి ఫోన్ లాగేసుకున్నారని.. వారెంట్ లేకుండా ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. ఘటనను జర్నలిస్టు కుటుంబం ఆడియో రూపంలో రికార్డు చేసి షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అని లోకేశ్ అడిగారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్ల పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని మండిపడ్డారు.

journalist shiva prasad kidnapped: nara lokesh

Recommended Video

Chandrababu Naidu has written a letter to Modi Over YSRCP tapping phones

జర్నలిస్ట్ శివప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలు, ఎంపీ బాలశౌరిపై కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు తీసుకెళ్లారని.. విడిచిపెడతారని విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనిపై ఏపీ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

English summary
journalist shiva prasad kidnapped by andhra pradesh police tdp leader nara lokesh alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X