వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు మీద ధ్వజమెత్తిన జెపి

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కాపు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అనుసరించిన వైఖరిని లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ తప్పు పట్టారు. చట్టబద్దమైన కమిషన్ అభిప్రాయం వినకుండా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ఆయన అడిగారు.

విజయవాడలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తోందని, వ్యవసాయంపై దృష్టి పెట్టడం లేదని, పెట్టుబడులు కూడా పెట్టడం లేదని ఆయన అన్నారు.

JP slams Kapu reservation, says farmers being ignored

ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా సరిపోదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోి విద్యా వ్యవస్థపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

రాష్ట్రంలో ఆస్పత్రుల తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులపై కనీసంగా కూడా నిధులు ఖర్చు చేయడం లేదని యన అన్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగించడం మంచిది కాదని అన్నారు.

English summary
Lok Satta founder Jayaprakash Narayan flayed the state government on the issue of reservations to Kapus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X