వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రుల చర్చలు: తగ్గిన జూనియర్లు డాక్టర్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదులోని జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. గాంధీ ఆస్ప్తత్రిలో సమ్మెకు దిగిన జూడాలతో డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య, హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి బుధవారం సాయంత్రం జరిపిన చర్చలలో సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జూడాల ప్రతినిధులు ప్రకటిం చారు.

గాంధీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం రోగి బంధువులు తమపై దాడికి పాల్పడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జూడాలు విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. జూడాలతో చర్చలు ముగిసిన అనంతరం రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రులలో ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాలని వైద్యులు కోరారనీ, ఇందుకు ప్రభుత్వం సమ్మతించిందని చెప్పారు.

ప్రధాన ఆసుపత్రులలో సిసి కెమెరాల సంఖ్యను పెంచాలని కోరినట్లు చెప్పారు. వారికి వెంటనే అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని రాజయ్య హామీ ఇచ్చారు. హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ఎవరు భౌతిక దాడులు చేసినా అది నేరమేననీ, ఇక మీదట వైద్యులపై దాడులు జరగకుండా పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు.గాంధీ ఆసుపత్రిలో ఎస్‌పిఎఫ్‌ ఏర్పాటుపై వారం రోజులలో సీఎంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

గాంధీ ఆస్పత్రిలో ఇలా..

గాంధీ ఆస్పత్రిలో ఇలా..

జూనియర్ డాక్టర్ల సమ్మెతో బుధవారంనాడు కూడా రోగులు సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

దిక్కు మొక్కు లేక..

దిక్కు మొక్కు లేక..

గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు బుధవారంనాడు కూడా సమ్మె చేయడంతో రోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

జూనియర్ డాక్టర్ల సమ్మె..

జూనియర్ డాక్టర్ల సమ్మె..

తమపై దాడికి నిరసనగా గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు బుధవారంనాడు కూడా సమ్మె చేశారు. దీంతో ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది.

రోగుల ఆందోళన

రోగుల ఆందోళన

గాందీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు గాంధీ ఆస్పత్రిలో సమ్మెకు దిగడంతో రోగుల బంధువులు కూడా మరో వైపు ఆందోళనకు దిగారు

జూనియర్ డాక్టర్ల సమ్మెతో...

జూనియర్ డాక్టర్ల సమ్మెతో...

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మెతో రోగులు, వారి బంధువులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.

విధుల బహిష్కరణ

విధుల బహిష్కరణ

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా జూడాలు విధులు బహిష్కరించారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలూ నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

వైద్య సేవల కోసం...

వైద్య సేవల కోసం...

రోగుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. రోగులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు.

రోగుల బంధువులు ఆగ్రహం

రోగుల బంధువులు ఆగ్రహం

వైద్యులు మూడు రోజులుగా సమ్మెకు దిగి విధులు బహిష్కరించినప్పటికీ సూపరింటెండెంట్‌ కల్పించుకోకపోవడంపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోగుల బంధువుల ఆవేదన

రోగుల బంధువుల ఆవేదన

ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ బంధువులను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యులే సమ్మెలో ఉంటే ఇక వారికి వైద్య సేవలు ఎలా లభిస్తాయని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

పరిస్థితి దారుణం

పరిస్థితి దారుణం

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగడంతో రోగుల పరిస్థితి ఆందోళనరంగా మారింది. దిక్కు తోచని పరిస్థితిలో ప్డడారు.

ఏం చేయాలో తెలియక...

ఏం చేయాలో తెలియక...

రోగులకు చికిత్స అందక వారి బంధువులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. వారి ఆందోళన చెప్పనలవి కాదు.

మంత్రులతో చర్చలు

మంత్రులతో చర్చలు

ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లతో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు.

English summary
Secunderabad Gandhi hospital jr doctors have withdrawn strike after the talks with Telangana ministers Nayani Narsimha Reddy and Rajaiah
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X