వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి.. ఘాట్ వద్దకు వెళ్లకూడదని జూ.ఎన్టీఆర్ నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

గురువారం (మే 28) స్వర్గీయ నందమూరి తారకరామరావు 97వ జయంతి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ప్రతీ ఏటా జయంతి రోజున నివాళులు అర్పిస్తుంటారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఘాట్ వద్దకు వెళ్లకూడదని కుటుంబ సభ్యులు బావిస్తున్నట్టు తెలుస్తోంది. నటులు జూనియర్ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వ లాక్ డౌన్ ఆంక్షలకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్తే మీడియా,పెద్ద ఎత్తున జనాలు అక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో.. ఇంటి వద్దే తాతకు నివాళులు అర్పించనున్నట్టు తెలిపారు. అభిమానులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు.

jr ntr and kalyan ram decides not to go to ntr ghat tomorrow

Recommended Video

David Warner Wishes Jr.NTR On His Birthday By Dancing 'Pakka Local' Song

మరోవైపు టీడీపీ కార్యకర్తలు గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో మహానాడులో పాల్గొంటున్నందునా.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సహా పలువురు కార్యకర్తలు ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తారని సమాచారం.

English summary
Tollywood hero's Jr.NTR,Kalyan Ram were decided not to visit their grand father NTR's ghat tomorrow due to coronavirus restrictions,said they will pay tribute to their grandpa at their home only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X