వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదన్న బాలయ్య చిన్నల్లుడు భరత్.. ఆగ్రహంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆగ్రహంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ || Balakrishna's Son-In-Law Sensational Comments On Jr NTR

జూనియర్ ఎన్‌టిఆర్‌పై బాలకృష్ణ రెండవ అల్లుడు, నందమూరి తేజస్విని భర్త శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు టిడిపి సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.జనసేన లక్ష్మీనారాయణ, వైసిపికి చెందిన ఎంవివి సత్యనారాయణపై వైజాగ్ పార్లమెంటు నుంచి పోటీ చేసిన భరత్, ఎంవివి సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. భరత్ తన ఓటమిని అధిగమించి ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు .ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపాయి.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలంటే పార్టీ అధినేతనే సుప్రీం అని శ్రీ భరత్ సంచలనం

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలంటే పార్టీ అధినేతనే సుప్రీం అని శ్రీ భరత్ సంచలనం

జూనియర్ ఎన్టీఆర్ టిడిపిలోకి తిరిగి వస్తే టీడీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో కాస్త స్థైర్యం నిండుతుంది అన్న భావన చాలా మంది వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు వర్మ వంటి వాళ్ళు బాహాటంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి మరీ చెప్పారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగుదేశం పార్టీ తిరిగి మనుగడ సాగించాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ స్వీకరిస్తే ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోతారని ట్వీట్ చేశారు. మునిగిపోతున్న టీడీపీని రక్షించగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది తారక్ ఒక్కరేనని వర్మ అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే వెంటనే టీడీపీని రక్షించే బాధ్యతలను తన భుజాలపై వేసుకోవాలని సూచించారు. ఇక ఈ నేపధ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, జూనియర్ ఫ్యాన్స్ జూనియర్ పార్టీకి ఈ సమయంలో వెన్నుదన్నుగా నిలవాలని సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో టిడిపిలో జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందా లేదా అని ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదని చెప్పిన శ్రీ భరత్ ఒకవేళ అవసరం అనుకుంటే ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు. ఇక ఆయన ఎన్టీఆర్ పార్టీని సంప్రదించాలి, లేకపోతే కాదు. ఏ వ్యక్తికి అయినా సరే పార్టీ సుప్రీం అని అన్నారు.

జూనియర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే ఒప్పుకోనన్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్

జూనియర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే ఒప్పుకోనన్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్

జూనియర్ వస్తేనే పార్టీకి మంచిది అంటే తన వరకు ఒప్పుకోనన్నారు. ఆయన పార్టీకి అవసరం, ఆయనుంటేనే పార్టీ బావుంటుందని తాను అనుకోవడం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పార్టీని రక్షించగలరని తాను అంగీకరించనని భరత్ అభిప్రాయపడ్డాడు . ఇక ఈ వాదన టిడిపికి ఉన్న యువ మరియు చైతన్యవంతమైన నాయకత్వాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదని శ్రీ భరత్ అన్నారు. మా నమ్మకం ఏంటంటే... యువ నాయకులతో, టాలెంట్‌తో కొత్త ఆలోచనలు చేయగలిగితే పార్టీని బిల్డ్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటూ 294మంది.. జూనియర్ ఎన్టీఆర్‌లా తెలిసినవారు కాదు , చరిష్మా ఉన్న నాయకులు కాదు అయినా 200మంది 30 ఏళ్లలోపు ఉన్నవాళ్లు, కొత్తవాళ్లు పార్టీని నడిపించారు కదా .. పలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదని పేర్కొన్నారు శ్రీ భరత్.

భరత్ వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం .. సోషల్ మీడియాలో ట్రోల్స్

భరత్ వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం .. సోషల్ మీడియాలో ట్రోల్స్

ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితిలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యత చేపట్టాలని భావిస్తుంటే భరత్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి . భరత్ వ్యాఖ్యలతో టిడిపి అభిమానులు, నాయకులు ఖంగు తిన్నారు . జూనియర్ ఎన్టీఆర్ కు గట్టిగా మద్దతు ఇస్తున్న టిడిపిలోని ఒక విభాగం ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులు కూడా బాధపడ్డారు. ఇక భరత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు . టిడిపి అభిమానులు మరియు జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం పార్టీకి ఇబ్బందిని కలిగిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని చేస్తోంది.

శ్రీ భరత్ కు రాజకీయ అనుభవం లేదు అందుకే ఇలా వ్యాఖ్యలంటున్న ఎన్టీఆర్ అభిమానులు

శ్రీ భరత్ కు రాజకీయ అనుభవం లేదు అందుకే ఇలా వ్యాఖ్యలంటున్న ఎన్టీఆర్ అభిమానులు

భరత్ రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కాబట్టి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. వాస్తవానికి, యనమల, అచ్చన్నాయుడు , కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు, లోకేష్ మరియు ఇంకా చాలా మంది టీడీపీ ముఖ్య నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఆచి తూచి స్పందిస్తారు. కానీ భరత్ వంటి యువ నాయకుడు అందులోనూ బాలయ్య చిన్నల్లుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బాధ్యత చేపట్టటంపై మాట్లాడటం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అటు శ్రీ భరత్ జూనియర్ ఫాన్స్ నుండి ట్రోల్స్ ఎదుర్కొంటూ ఆ హీట్ ఎలా ఉంటుందో రుచి చూస్తున్నాడు .

English summary
Balayya's second son-in-law Sri Bharat's comments on Jr NTR have become hot topic in TDP circles. Bharat spoke about Jr NTR's re-entry into TDP saying that NTR should approach party but not otherwise. He said no individual is above the party and said party is the supreme power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X