వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్వేది ఘటనపై జనసేన దీక్షలు- హైదరాబాద్‌లో పవన్‌- ఏపీలో జనసేన నేతలు..

|
Google Oneindia TeluguNews

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటనకు నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ధర్మ పరిరక్షణ దీక్షలు చేపట్టారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చాయి.

ధర్మ పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పవన్ ఇవాళ దీక్షకు దిగారు. ఇంట్లోనే ఉన్న ఫామ్‌ హౌస్‌లో ఆయన దీక్ష చేపట్టారు. అదే విధంగా ఏపీ వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టాయి.

jsp hold one day deeksha against antarevedi incident, pawan protest in hyderabad

Recommended Video

Kisan Rail From Anantapur To Delhi సౌత్‌లో ఫస్ట్‌ కిసాన్ రైలు,కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన జగన్
విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాకుళం విజయనగరం పట్టణాల్లో జనసేన నాయకులు ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు.

అంతర్వేది రథం ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని నేతలు విమర్శించారు. దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ దీక్షలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
janasena party chief pawan kalyan and other leaders hold dharma parirakshana deeksha today against recent antarvedi incident. pawan sit on protest in his home at hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X