వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జి లోయాను చంపేశారు .. అమిత్ షా ప్రమేయం ఉంది: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ నేత నారాయణ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు విచారిస్తున్న సీబీఐ జడ్జి లోయా మృతి కేసులో అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: సీపీఐ నేత నారాయణ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై సంచలన ఆరోపణలు చేశారు. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులోవాదనలు వింటున్నసీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి లోయా మృతి కేసులో అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు.

శనివారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో సంక్షోభం మొదలైందన్నారు. జడ్జి లోయాను చంపేశారని, కల్కాపూర్ న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకున్నారని, వేల కోట్ల రూపాయల మెడికల్ కుంభకోణం జరిగితే, జడ్జిలను మార్చి కేసులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

cpi-narayana

పోలవరం ప్రాజెక్టు గురించి నారాయణ ప్రస్తావిస్తూ, నిర్వాసితుల పునరావాసానికి రూ.32 వేల కోట్లు కావాలని, పునరావాస నిధులపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వలేదని, విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో లేదని విమర్శించారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తానని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు.

English summary
CPI Leader Narayana made sensational comments on BJP National President Amit Shah that Amit shah's involvement is there in the death of Judge Loya. While talking to media Narayana alleged that CBI Special Court's Judge Loya's death is a murder. He also said that crisis started in Judiciary and by changing judges supreme court Chief justice tried to dissolve the Medical Colleges Scam. Regarding Polavaram Project, Central Government is not given promise on Funds, not only that promises regarding the state bifercation also central government is not sticking on it's word, he concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X