వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Jr NTR: తారకరత్న ఆరోగ్యంపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా.. బాబాయ్ బాలకృష్ణకు ఫోన్.. కుప్పంకు పయనం..!

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

సినీ నటుడు నందమూరి తారకరత్న గుండె పోటు వచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్రలో
పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు తెలిపారు. శరీరం నీలంగా మారిందని.. వెంటనే చికిత్స ప్రారంభించమన్నారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు.

Junior NTR called Balakrishna to know about Tarakaratnas health

తారక రత్నకు గుండె నాళాల్లో ఎక్కవ బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు... యాంజియోగ్రామ్ ద్వారా బ్లాక్ లు తొలిగించారు. రేపటికి కానీ పరిస్థితి చెప్పలేమన్నారు. కాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కాసేపట్లో కుప్పంకు బయల్దేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తారకరత్న ఆరోగ్యం పై చంద్రబాబు ఆరా తీశారు.

ఉదయం కుప్పం సమీపంలోని వరదరాజ స్వామి ఆలయంలో పూజల తర్వాత మసీదులో ఆయన ప్రార్థనలను నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో తారకరత్న కూడా పాల్గొన్నారు. అనంతరం మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల తాకిడి పెరిగింది.
పాదయాత్రలో నడుస్తున్న సమయంలో తారకకత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు.

English summary
Film actor Nandamuri Tarakaratna got a heart attack. TDP National General Secretary Nara Lokesh in Yuvagalam Padayatra Tarakaratna, who was involved, suddenly collapsed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X