• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుపై ఫైర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే .. ఆ డబ్బు తనకిస్తే అమరావతి పూర్తి చేసేవారట

|
  AP Assembly Election 2019: చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ నార్నే శ్రీనివాసరావు!!

  ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల వ్యవదే ఉంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక చంద్రబాబుకు రివర్స్ కౌంటర్ లు ఇస్తున్నారు వైసీపీ అధినేత జగన్ మరియు వైసీపీ నాయకులు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొలిటికల్ హీట్ పీక్స్ చేరుతున్న సమయంలో చంద్రబాబు టార్గెట్ గా అయన విమర్శల వర్షం కురిపించారు.

  జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నే శ్రీనివాసరావు హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వారిని మోసం చేసి రివర్స్ తిట్టటం అలవాటుగా మారిందని ఆయన ఆన్నారు . ప్రతి ఐదేళ్లకొకసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం దానిని మోసం చేయడం, బయటకు రావడం, ఆ పార్టీని తిట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందన్నారు. గత ఎన్నికల్లో అదేతరహాలో బీజేపీతో పొత్తు పెటుకుని నాలుగేళ్ళు స్నేహం చేసి చివరకు ఎపీకి మోసం చేశారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని నార్నే ఫైర్ అయ్యారు.

  జ‌గ‌న్ కు అధికార‌ యోగం : ఏపికి ప్ర‌త్యేక హోదా : వైసిపి కార్యాల‌యంలో పంచాగ శ్ర‌వ‌ణం..!

  Junior NTRs uncle Narne fired on Chandrababu .. if central gives money to him he would have completed the capital

  ప్రధాని నరేంద్రమోడీని నాలుగేళ్లు నెత్తిన ఎక్కించుకుని హోదా వద్దు ప్యాకేజ్ ముద్దు అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని నార్నే ఆరోపించారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో లాభాలు వస్తాయని జీఎస్టీ సమస్య ఉండేది కాదన్నారు.చంద్రబాబుకు ఇచ్చినట్లుగా రాజధాని నిర్మాణానికి డబ్బు తనకు కాని మరో బిల్డర్‌కు కానీ ఇచ్చుంటే ఈపాటికే అమరావతి పూర్తయిపోయి ఉండేదని నార్నే ఎద్దేవా చేశారు. ఇంకో 20 ఏళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నా అమరావతి ఇలాగే ఉంటుందని అందులో ఏ మార్పు రాదని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు . అందరూ ఈ దఫా జగన్ కు ఓటెయ్యాలని కోరారు. జగన్‌కు అవకాశం ఇస్తే ఎన్టీఆర్, వైఎస్సార్‌లను మించిన నాయకుడు అవుతారని నార్నే తేల్చి చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Junior NTR's uncle, YCP leader Narne Srinivasa Rao spoke to media at Lotus pond in Hyderabad. Chandrababu has become a habit to make alliance and deceive the parties. Narne said Amravati is still in the process of construction. Junior NTR's uncle Narne fired on Chandrababu .. if central gives money to him he would have completed the capital .Srinivasa Rao has been fired that capital willnot complete for another 20 years if Chandrababu was in power.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more