వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే స్వ‌యంగా చూసుకుంటా: టీడీపీ నేత‌ల తీరు పైన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఫైర్‌: ఇక మొద‌లెట్టేసారా..!

|
Google Oneindia TeluguNews

ఉద్దేశ‌పూర్వ‌క‌మో..యాధృచ్చిక‌మో ఎన్నిక‌ల ఫ‌లితాలపై పోస్టుమార్టం జ‌రుగుతున్న వేళ జూనియ‌ర్ ఎన్టీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్టీయార్ ఘాట్ వెలవెలబోయింది. పూలతో కలకలలాడాల్సిన సమాధి కల తప్పడంతో జూనియర్ ఎన్టీయార్ ఈ వ్యాఖ్య‌లు చేసారు. ఇప్పుడు ఇవి టీడీపీలో హ‌ట్ టాపిక్‌గా మారాయి.

జూనియ‌ర్ అస‌హ‌నం..
టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద నివాళి అర్పించేందుకు నంద‌మూరి కుటుంబం అక్క‌డ‌కు చేరుకుంది. అయితే, గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఘాట్ వ‌ద్ద ఎటువంటి అలంక‌ర‌ణ‌లు చేయ‌క‌పోవ‌టంతో జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ అసహనం వ్యక్తం చేశారు. ఉద‌యాన్నే జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. క‌ళ్యాణ్ రాం తాత స‌మాధి వ‌ద్ద‌కు రాగానే అక్క‌డి ప‌రిస్థితిని చూసి షాక్ అయ్యారు. ఎన్టీఆర్ ఘాట్ మీద ఒక్క పువ్వు కూడా లేకుండా వెలవెల పోయింది. గ‌తంలో ఎప్పుడూ ఇటువంటి ప‌రిస్థితులు త‌లెత్త‌లేదు. ఈ ప‌రిస్థితి చూసి ఒక్క సారిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అదే స‌మ‌యంలో ల‌క్ష్మీ పార్వ‌తి..బ్రాహ్మ‌ణి సైతం నివాళి అర్పించారు. ఆ స‌మ‌యంలో జూనియ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించాయి.

Junior NTR sensational comments became hot topic in AP politics..

నేనే స్వ‌యంగా చూసుకుంటా..
త‌న తాత స‌మాధిని ఎటువంటి అలంక‌ర‌ణ లేకుండా వ‌దిలేయ‌టంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. త‌ను అనుచ‌రుల‌తో వెంనే భారీగా పుష్పాల‌ను తెప్పించి తానే స్వ‌యంగా ఎన్టీఆర్ స‌మాధిని అలంక‌రించారు. త‌న అభిమానుల ద్వారా స‌మాధి మొత్తం పూల‌తో తీర్చిదిద్దారు. త‌రువాత స‌మాధి వ‌ద్ద నివాళి అర్పించారు. ఆ త‌రువాత కాసేపు ఎన్టీఆర్ స‌మాధి వ‌ద్ద మౌనంగా కూర్చున్నారు. అదే స‌మ‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. తానే ఇక నుండి త‌న తాత వ‌ర్దంతి..జ‌యంతి వేడుక‌ల ఏర్పాట్ల‌ను స్వ‌యంగా చూసుకుంటాన‌ని ప‌ర్క‌టించిన జూనియ‌ర్ వ్యాఖ్య‌ల‌తో ఒక్క సారిగా చ‌ర్చ మొద‌లైంది. ఏపీలో టీడీపీ ఓట‌మి త‌రువాత జూనియ‌ర్ ఇక బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌నే చ‌ర్చ మొద‌లైంది. ఈ స‌మ‌యంలో జూనియ‌ర్ వ్యాఖ్య‌లు చర్ర‌చ నీయాంశంగా మారింది.

English summary
Junior NTR sensational comments became hot topic in AP politics. Junior says he will take of His grand father NTR's death anniversary and Birth days in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X