వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెరిటేజ్ పాలను వాడుతూనే బాబును తిట్టా: జూపూడి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను అనుసరించి మాత్రమే టిడిపి అధినేత, ఏపి సిఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశానని చెప్పారు.

హెరిటేజ్ పాలు వాడితే క్యాన్సర్ వస్తుందని తాను విమర్శిస్తున్న సమయంలో కూడా.. తమ ఇంట్లో హెరిటేజ్ పాలనే వాడామని ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఆలోచన విధానం మారిందని, ఆయన మార్గం తనకు నచ్చబట్టే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

దళిత అభ్యుదయానికి కృషి చేస్తానని జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. కొందరు కావాలనే తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. తన ప్రశ్నలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి సమాధానం రాకపోవడంతోనే తాను ఆ పార్టీని వీడినట్లు చెప్పారు.

Jupudi Prabhakar Rao interesting comments on Heritage milk

తుళ్లూరు మండలంలో అరటి తోటలకు నిప్పు: బాబు ఆరా

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాతిపాదిత ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అరటి తోటలకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి రైతులను పరామర్శించారు.

కాగా, పెనుమాక, ఉండవల్లిలో డ్రిప్ పైపులు, షెడ్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని భూములు ఇవ్వడానికి నిరాకరించినందునే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా తుళ్లూరులో అరటి తోటలకు నిప్పుపెట్టిన ఘటనపై ఏపి సిఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దుండగులను ఉపేక్షించరాదని కలెక్టర్‌ను ఆదేశించారు.

English summary
Telugudesam leader Jupudi Prabhakar Rao said that when he was abused AP CM Chandrababu Naidu, while they were using heritage milk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X