వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం- సీఎం జగన్, గవర్నర్‌ సమక్షంలో

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ఇవాళ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ హరిచందన్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Recommended Video

Andhra Pradesh : Justice Joymalya Bagchi Swearing As AP High Court judge | Oneindia Telugu

నేహా మాలిక్ బీచ్ అందాలు.. గోవాలో అందాల ఆరబోత

ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కార్‌-ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు-ఐపీఎస్‌లకు లేఖఏబీని వెంటాడుతున్న జగన్ సర్కార్‌-ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు-ఐపీఎస్‌లకు లేఖ

justice arup kumar goswami takes oath as new chief justice to ap high court

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ కొత్త ఛీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటు సీఎం జగన్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, లాయర్లు, జడ్డీలు కూడా హాజరయ్యారు. గవర్నర్‌ హరిచందన్‌ కొత్త ఛీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామితో సంప్రదాయ పద్దతిలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్‌, సీఎం జగన్‌ ఒకరికొకరు అభివాదాలు చేసుకున్నారు.

justice arup kumar goswami takes oath as new chief justice to ap high court

సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అరూప్ కుమార్‌ గోస్వామిని తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ కొత్త ఛీఫ్‌ జస్టిస్‌గా నియమించింది. ఇక్కడ ఛీఫ్ జస్టిస్‌గా ఉన్న జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు పంపింది. కొలీజియం నిర్ణయాన్ని ప్రభుత్వం కూడా నోటిఫై చేసిన తర్వాత జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి కొత్త ఛీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. పాత ఛీఫ్ జస్టిస్‌ జేకే మహేశ్వరి నిన్న హైకోర్టులో వీడ్కోలు తీసుకున్నారు. ఆయన స్ధానంలో ఇవాళ్టి నుంచి జస్టిస్‌ అరూప్ బాధ్యతలు చేపట్టనున్నారు.

English summary
justice arup kumar goswami has taken oath as new chief justice to high court today. governor harichandan administered his oath taking in vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X