అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి: మాజీ జస్టిస్ రాకేష్ స్థానంలో: ప్రమాణ స్వీకారం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి నియమితులు అయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ చేయడం ద్వారా ఏర్పడిన ఖాళీని జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ బదిలీతో భర్తీ అయింది. ఈ ఉదయం హైకోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా జోయ్‌మల్యా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది హాజరయ్యారు.

వీడియో: పంజగుట్టలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్: సిటీ బస్‌పై బంగీ జంప్‌వీడియో: పంజగుట్టలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్: సిటీ బస్‌పై బంగీ జంప్‌

జస్టిస్ రాకేష్ కుమార్ కిందటి నెల 31వ తేదీన పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన ఆయన గత ఏడాది ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక్కడే పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీని నియమించారు. ఇంతకుముందు వరకు జస్టిస్ బాగ్చీ కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కాగా- ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి కూడా ట్రాన్స్‌ఫర్ అయిన విషయం తెలిసిందే. ఆయనను సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. దీన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫై చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

 Justice Joymalya Bagchi takes oath as High Court Judge of Andhra Pradesh

Recommended Video

High Court Set A 3 Day Deadline For The Government In The Nimmagadda's Case

సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ నియమితులయ్యారు. గురువారం ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తోన్న జస్టిస్ హిమా కోహ్లీకి పదోన్నతి కల్పిస్తూ.. తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించింది. తెలంగాణ చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను కోల్‌కత హైకోర్టుకు బదిలీ చేసింది. కాగా.. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన మురళీధర్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు.

English summary
Justice Joymalya Bagchi was sworn in as the Andhra Pradesh High Court judge on Monday morning. High Court Chief Justice JK Maheshwari administered the oath of office to him. Justice Bagchi had earlier served as a Kolkata High Court judge and was here on transfer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X