వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం:బిసి కమీషన్ కు జస్టిస్ మంజునాథ రాజీనామా...ఎందుకంటే...?

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవికి జస్టిస్ కేఎల్ మంజునాథ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను మెయిల్ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ కు పంపారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినందున...ఇక తనకు పనిలేదని....అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు మంజునాథ తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బిసి కమిషన్ కు తనను ఛైర్మన్ గా నియమించినందుకు సీఎంకు మంజునాథ ధన్యవాదాలు తెలిపారు.

Justice KL Manjunatha resigns as chairman of the BC Commission

1970వ దశకంలో రాష్ట్రంలో మొదటిసారి బిసి కమీషన్ ఏర్పాటైంది. ఇప్పటి వరకూ అనేక కమీషన్లు ఏర్పాటైనా ప్రతీ కమీషన్ కూడా ఏదో ఒక నివేదికను ప్రభుత్వం లాంఛనప్రాయంగా ఇస్తుండేవి. ఎన్నికల హామీల్లో కాపులను వెనుకపడిన వర్గాల జాబితాలో చేర్చుతానని టిడిపి వాగ్ధానము చేసింది. అయితే తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాటంటూ ముద్రగడ పద్మనాభం ఉద్యమం ఆరంభించిన క్రమంలో ఎపి ప్రభుత్వం మంజూనాధ కమీషన్ వేసిందనేది బహిరంగ రహస్యం.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఎపి ప్రభుత్వం మంజునాథ కమిటీని 29 జనవరి 2016లో నియమించింది . కాపులను వెనుకపడిన కులాల్లో చేర్చే విషయంలో ఈ కమిటీ 9 నెలల్లో తన నివేదికను సమర్పించాలి అని ఆ సందర్భంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆ తరువాత కమిషన్ సభ్యులు బిసి కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం, ఆ క్రమంలో సభ్యులకు,ఛైర్మన్ మంజునాథకు మధ్య విభేదాళు తలెత్తడం...ఆ తరువాత ఛైర్మన్ తన నివేదిక సమర్పించడం...తదిదర పరిణామాల గురించి తెలిసిందే. ఆ తరువాత ఇంతకాలానికి హఠాత్తుగా బిసి కమీషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Amaravathi: Justice KL Manjunatha resigned as chairman of Andhra Pradesh BC Commission. He sent his resignation letter to Chief Minister Chandrababu Naidu and Chief Secretary Dinesh Kumar through Online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X