వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చండీగఢ్‌ హైకోర్టు జడ్జీ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఛండీగఢ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నరేశ్‌కుమార్‌ సంఘీ సోమవారం కన్నుమూశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన గుండెపోటుతో మరణించినట్లు తిరుపతి స్విమ్స్‌ వైద్యులు తెలిపారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆదివారం తిరుమల చేరుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోజనానంతరం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లాలనే ప్రయత్నంలో ఉండగా ఛాతి నొప్పిగా ఉందంటూ కుటుంబసభ్యులకు తెలిపారు.

Justice Naresh Kumar Sanghi passes away

వెంటనే తిరుమలలోని అపోలో అత్యవసర హృదయ చికిత్సాలయానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.

ఈ విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వైద్యులతో మాట్లాడారు. స్విమ్స్‌ ఆస్పత్రికి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు చేరుకుని నివాళులర్పించారు.

కాగా, హైకోర్టు న్యాయమూర్తి నరేష్ కుమార్ సంఘీకి మృతికి సంతాప సూచకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని అన్ని కోర్టులకు మంగళవారం సెలవు ప్రకటించారు.

English summary
Justice Naresh Kumar Sanghi (60), sitting judge of the Punjab and Haryana High Court, died on Monday afternoon after suffering a massive heart attack at Tirupati in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X