వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త బాస్: తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జిస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. శనివారం రాజ్‌‌భవన్‌లో అట్టహాసంగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. జస్టిస్ రాధాకృష్ణన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు ఆయన ఛత్తీస్‌ఘఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సూచనమేరకు జస్టిస్ రాధాకృష్ణన్‌ను తెలుగురాష్ట్రాలకు ఛీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం తాత్కాలిక ఛీఫ్ జస్టిస్‌గా సేవలందించిన రమేష్ రంగానాథన్ మరో హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా వెళ్లే వరకు ఇక్కేడ జడ్జిగా సేవలందిస్తారు.

Justice Radhakrishnan sworn in as Chief Justice of AP and Telangana High Court

రాధాకృష్ణన్ 1959లో భాస్కరన్ నాయర్,పారుకుట్టిఅమ్మ దంపతులకు కేరళలో జన్మించారు. బెంగళూరు యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన రాధాకృష్ణన్...కొల్లాంలో తన న్యాయవృత్తిని ప్రారంభించారు.

డిసెంబర్ 11, 1983లో బార్‌లో తన పేరును నమోదు చేసుకున్న రాధాకృష్ణన్ తిరువనంత పురంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా సేవలందించారు. ఆ తర్వాత తాత్కాలిక ఛీఫ్ జస్టిస్‌గా కేరళ హైకోర్టులోనే రెండు సార్లు సేవలందించారు. అనంతరం గతేడాది మార్చి 18న ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.

English summary
Justice Thottathil Bhaskaran Nair Radhakrishnan has been appointed Chief Justice of Hyderabad High Court for the States of Andhra Pradesh and Telangana.His swearing in ceremony took place in Rajbhawan. He was administered the oath of office by Governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X