వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి చీఫ్ జస్టిస్ గా విక్రమ్ నాథ్ నియామకం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్ పేరును ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం నిర్ణయం తీసుకుంది. ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది . జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు.

జస్టిస్ విక్రమ్‌నాథ్ 1962 లో జన్మించారు. ఆయన తన గ్రాడ్యుయేషన్ సైన్స్ లో 1983 లో పూర్తి చేశారు . 1986 లో లా కోర్సు పూర్తి చేసారు. 1987 నుండి అడ్వకేట్ గా అలహాబాద్ కోర్టులో ప్రాక్టిసు చేసిన ఆయన 2004 సెప్టెంబర్ 24న అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2024 సెప్టెంబర్ 23 వరకు విక్రమ్‌నాథ్ సర్వీసులో ఉండనున్నారు.

 Justice Vikram Nath as First Chief Justice of Andhra Pradesh HC

హైకోర్టు విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన సంవత్సరం తొలి రోజున కార్యకలాపాలు ప్రారంభించింది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ విక్రమ్‌నాథ్ తాజాగా నియమితులయ్యారు.

English summary
Mr. Justice Vikram Nath is the senior-most Judge from Allahabad High Court and is functioning in that High Court since his elevation. Having regard to all relevant factors, the Collegium finds Mr Justice Vikram Nath suitable in all respects for being appointed as Chief Justice of the Andhra Pradesh High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X