వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు అహంభావి, విధ్వంసం మానండి: జగన్‌కు భూమా, జ్యోతుల లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, డేవిడ్‌లు సోమవారం మండిపడ్డారు. విధ్వంసం మీ విధానమని, మీ అంతటి అహంభావి లేడని, నిత్యం పదవి కోసమే తపన అని జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

ప్రతిపక్షంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ విస్తృతస్థాయిు సమావేశం ఏర్పాటు చేసిన జగన్ ఈ రెండేళ్ల తన పాత్రపై ఆత్మవిముర్శ చేసుకోవాలన్నారు. ఈ రెండేళ్లలో విధ్వంసకర పాత్ర తప్ప బాద్యతాయుత ప్రతిపక్షంగా వైసిపి ఎన్నడు వ్యవహరించలేదని దుయ్యబట్టారు.

జ్యోతుల షాకిచ్చాక..: ద్వారంపూడి చక్రం, లెక్కలతో ముందుకెళ్తున్న జగన్ఇబ్బందులతో కూడిన నవ్యాంధ్రకు ప్రతిపక్ష నేతగా జగన్ చేయూత నివ్వాలని, కానీ ఆయన సమస్యలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి పీఠం దక్కలేదన్న అక్కసుతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పదవి కోసం పరితపిచడమేు మీకు పనిగా మారిందని విమర్శించారు.

Jyothula and Bhuma open letter to YS Jagan

రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ఈ సమయంలో జగన్ నిర్మాణాత్మకంగా ఉండాలన్న అభిప్రాయుం ప్రజల్లో ఉందని, కానీ మీ వైఖరి అందుకు భిన్నంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏం చేసి దానిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

రాజధాని భూసమీకరణను అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని, రాయలసీమకు ఉపయోూగపడే పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో కూడా దుర్బుద్దిని చాటుకున్నారని దుయ్యబట్టారు. వీు నీటిని తరలించుకొని పోతున్నారని గోదావరి జిల్లాల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రాజెక్టులు పనికి రావని రాయలసీమలో దుష్ప్రచారం చేశారన్నారు.

అదో బానిస బతుకు, అహంకారం: జగన్‍‌కు జ్యోతుల సూటి ప్రశ్నలుమీ పైన అవినీతి కేసుల్లో విచారణ సక్రమంగా జరగడం లేదని, సిబిఐ పైన నమ్మకం లేదని ఇంతకాలం ఆరోపించిన మీరు (జగన్), ఇప్పుడు తుని ఘటన పైన మాత్రం సిబిఐతో విచారణకు పట్టుబట్టడం విడ్డూరమన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత దేశ చరిత్రలో కనిపించరన్నారు.

తెలంగాణ ఏపీకి ఎంత అన్యాయం చేసినా పట్టనట్లుగా ఉన్నారని మండిపడ్డారు. జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరని, అహంభావం, అసహనం ఉన్న వ్యక్తి అన్నారు. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

English summary
MLAs Jyothula Nehru and Bhuma Nagi Reddy open letter to YSRCP chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X