వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు షాక్: కార్యకర్తలకు జ్యోతుల సందేశం, నాకివ్వకపోయినా..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూకు కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆయనకు నిరాశ ఎదురయింది. జ్యోతులకు మంత్రి పదవి రాకపోడవంతో ఆయన వర్గం నిరాశలో ఉంది. ఈ నే

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జ్యోతుల నెహ్రూకు కేబినెట్ విస్తరణలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఆయనకు నిరాశ ఎదురయింది. జ్యోతులకు మంత్రి పదవి రాకపోడవంతో ఆయన వర్గం నిరాశలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలకు ఓ సందేశం పంపించారు.

భవిష్యత్తులో న్యాయం చేస్తానని బాబు హామీ

భవిష్యత్తులో న్యాయం చేస్తానని బాబు హామీ

తాను నియోజకవర్గ అభివృద్థి కోసమే పార్టీ మారానని, తర్వాత నియోజక వర్గంలోని ఎన్నో అభివృద్థి కార్యక్రమాలు చేపట్టానని, నియోజకవర్గ ప్రజల అభివృద్ధే ముఖ్యమని, పదవులతో పని లేదని, మంత్రి వర్గ విస్తరణలో ప్రస్తుతం న్యాయం చేయక పోయినా భవిష్యతలో తప్పకుండా న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని జ్యోతుల అన్నారు.

చంద్రబాబు మాటపై నమ్మకం

చంద్రబాబు మాటపై నమ్మకం

ఎవరూ నిరాశ చెందవద్దని, ఇప్పటి వరకు అభివృద్థి పనుల్లో ఏ విధంగా చురుకైన పాత్ర పోషించామో, దానికి రెట్టింపు చురుగ్గా అభివృద్థి పనుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మాట మీద తనకు నమ్మకం ఉందని, పార్టీని బలోపేతం చేస్తూ నియోజక వర్గాన్ని ప్రగతిపథంలో నడిపిస్తానని చెప్పారు.

నాకు ఇవ్వకపోయినా..

నాకు ఇవ్వకపోయినా..

మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన తనకు ఎలాంటి నష్టం లేదని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. ఎమ్మెల్యే తోటకు మంత్రి పదవి ఇవ్వక పోవడం పట్ల ప్రభుత్వంపై ఆయన వర్గీయులు మండిపడ్డారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. తనకు మంత్రిపదవి ఇవ్వడం ఇవ్వకపోవడమనేది సీఎం పరిధిలో ఉండే నిర్ణయమని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఈ మంత్రుల వల్ల పార్టీకి మేలుజరుగుతుందనే ఆలోచించే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఉంటారన్నారు.

కాపు ఉద్యమానికి అండగా..

కాపు ఉద్యమానికి అండగా..

కాపు ఉద్యమానికి అండగా ఉంటూనే అన్ని సామాజికవర్గాల మద్దతుతో ప్రజాసేవకు అంకితం అవుతానని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. కాపు సామాజికవర్గం నుండే కాక జిల్లా నుంచి సైతం చాలామంది తనకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షించడం సంతోషమని అయితే తనకి మంత్రిపదవి ఉన్నా, లేకున్నా ప్రజాభిమానాన్ని మించిన పదవి లేదన్నారు. ఇంతమంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనే ఆలోచన పార్టీ అధిష్టానానికి రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలన్నారు.

బొజ్జలను తొలగించడం దారుణం

బొజ్జలను తొలగించడం దారుణం

సీనియర్‌ నేత బొజ్జాల గోపాలకృష్ణా రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని తోట త్రిమూర్తులు అభిప్రాయపడ్డాహరు. వయస్సు పైబడినప్పటికీ పార్టీ కోసం పాటుపడ్డ వ్యక్తిగా గోపాలకృష్ణా రెడ్డిని కొనసాగించి ఉంటే బాగుండేదన్నారు.

English summary
Telugudesam Party Leader and MLA Jyothula Nehru said that AP CM Chandrababu Naidu will dio justice to him in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X