వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపిలో ఉన్నప్పుడు జగన్ పట్టించుకోలేదు, ఆశ్చర్యం లేదు: హెచ్చరికపై బాబుకు జ్యోతుల సూచన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యల దృష్ట్యా సెక్యూరిటీ పెంచాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యల దృష్ట్యా సెక్యూరిటీ పెంచాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 బాబు నేను ఒకేసారి, చిన్నపిల్లలు వారితోనా: అఖిలప్రియపై గంగుల బాబు నేను ఒకేసారి, చిన్నపిల్లలు వారితోనా: అఖిలప్రియపై గంగుల

జగన్ గురించి తెలుసుకు కాబట్టి ఆశ్చర్యం లేదు

జగన్ గురించి తెలుసుకు కాబట్టి ఆశ్చర్యం లేదు

చంద్రబాబుకు మరింత సెక్యూరిటీ పెంచాలని హితవు పలికారు. ఓ టీవీ ఛానల్‌లో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్ ఎలాంటి వ్యక్తో తెలియకపోతే ఆశ్చర్యపడాలని, నేర ప్రవృత్తి కలిగిన జగన్ ఎలాంటి వ్యక్తో తనకు తెలుసు కాబట్టి ఆశ్చర్యపడటం లేదన్నారు.

బాబు జాగ్రత్త, వైసిపిలో ఉన్నప్పుడు చెబితే పట్టించుకోలేదు

బాబు జాగ్రత్త, వైసిపిలో ఉన్నప్పుడు చెబితే పట్టించుకోలేదు

కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని జ్యోతుల చెప్పారు. కుంచిత స్వభావం, ఆలోచనలు కలిగిన వ్యక్తి జగన్ అని, అధికారపక్షాన్ని విమర్శించడం మాత్రమే చేయకూడదు, సూచనలు కూడా చేయాలని నాడు తాను వైసీపీలో ఉన్నప్పుడు చెబితే జగన్ పట్టించుకునేవారు కాదన్నారు.

జగన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

జగన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

జగన్ లాంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని జ్యోతుల నెహ్రూ అన్నారు. నంద్యాల ఉపఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అభివృద్ధిని కోరుకునే టిడిపికి, అరాచకాలకు పాల్పడే వైసిపికి మధ్య పోటీ అని అన్నారు.

గెలవడం కాదు.. మెజార్టీ పైనే

గెలవడం కాదు.. మెజార్టీ పైనే

నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటర్లు ఉన్నారని, తాము గెలవడం ప్రామాణికం కాదని, ఎంత మెజార్టీతో తమ అభ్యర్థి విజయం సాధిస్తాడనే దానిపైనే ఆలోచిస్తున్నామన్నారు.

కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు

కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు, జగన్‌కు లంకె పెడుతూ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి ప్రమాదకరం ఐసిస్ అని, రాష్ట్రానికి ప్రమాదకరం జగన్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్న జగన్‌లో నంద్యాల ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయం కనపడుతోందన్నారు. ఈ భయంతో నంద్యాల ఉపఎన్నిక వాయిదా వేయించాలని జగన్ చూస్తున్నారన్నారు.

English summary
Telugu Desam Party leader Jyothula Nehru on Friday suggested CM Chandrababu Naidu over YSRCP chief YS Jaganmohan Reddy's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X