• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రీ ఎంట్రీ ఇచ్చిన కేఏ పాల్ ... కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పై హైకోర్టులో పిటీషన్ పాల్ ... నేడే విచారణ

|

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. పొలిటికల్ సెటైరికల్ గా తెర మీదికి రాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కెఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేఏ పాల్ అడ్డంగా దొరికిపోయారు..! తొమ్మిదేళ్ల తరువాత తెర మీదికి ఆ కేసు

 కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కోర్టుకెక్కిన కేఏ పాల్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై కోర్టుకెక్కిన కేఏ పాల్

గత ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేసిన పాల్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన కె ఏ పాల్ రాంగోపాల్ వర్మ పుణ్యమాని మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి .వాటిలో కేఏ పాల్ ను జాఫర్ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు గా ఉన్న సీన్ నేపథ్యంలో, సినిమాలో తన అనుమతి లేకుండా తనను సైతం టార్గెట్ చేసిన తీరుపై కే ఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు.

సినిమా ఆపాలని కోర్టును కోరిన కేఏ పాల్

సినిమా ఆపాలని కోర్టును కోరిన కేఏ పాల్

ఈనెల 29న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని రాంగోపాల్ వర్మ చెబుతున్న నేపథ్యంలో ఆ సినిమా ఆపివేయాలని కేపాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను, సెన్సార్ బోర్డును, రాంగోపాల్ వర్మను అలాగే జబర్దస్త్ కమెడియన్ రాము తదితరులను చేర్చారు.

నేడు కోర్టులో కేఏ పాల్ పిటీషన్ పై విచారణ

నేడు కోర్టులో కేఏ పాల్ పిటీషన్ పై విచారణ

నేడు ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం తీస్తానని చెప్పి నాటినుండి నేటి వరకు అన్ని కాంట్రవర్సీ లే. ఆ సినిమా పేరు నుండి సినిమాలోని కంటెంట్ వరకు ప్రతి దానిపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కె ఏ పాల్ వేసిన పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ ఏ విధంగా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు కేఏపాల్ పిటిషన్ విషయంలో ఏం చెప్తుంది అనేది తెలియాల్సి ఉంది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ కూడా తీస్తానంటున్న వర్మ

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సీక్వెల్ కూడా తీస్తానంటున్న వర్మ

ఎవరు ఎన్ని కేసులు వేసినా, ఎంత విమర్శలు చేసినా ఏ సినిమా తీసిన వివాదాస్పద కథనే ఎంచుకునే వర్మ ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తన శిష్యుడు సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్సే వచ్చిందని భావిస్తున్న వర్మ ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉన్న ఈ సినిమాకు రీసెంట్ గా సీక్వెల్ ప్రకటించాడు. తాజాగా వల్లభనేని వంశీ ఇంటర్వ్యూల్లో తిడుతున్న తిట్లను చూస్తే తనకో ఆలోచన వచ్చిందని.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'కు సీక్వెల్ తీయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు వర్మ. దానికి ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెట్టబోతున్నానని వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

English summary
Praja Shanti Party president KA Paul filed a petition against kamma rajyamlo kadapa redlu movie. Rangopal Varma said that the kamma rajyamlo Kadapa Redlu movie will be brought to the audience on the 29th of this month. The petition filed by Prajashanti Party chief KA Paul included the Central Information Ministry, the Censor Board, Rangopal Varma as well as the Jabardast Comedian Ramu. The petition will be heard by the court today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X