వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు మద్దతిచ్చిన కేఏ పాల్ .. బాబు కోసం ఢిల్లీ వెళ్ళిన పాల్

|
Google Oneindia TeluguNews

ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ఈసీ తీరుపై మండిపడ్డారు .ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ప్రజాశాంతి పార్టి అధినేత కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ విషయంతో తాను సీఎం కు మద్దతిస్తున్నట్లు తెలిపిన పాల్ చంద్రబాబు చేపట్టే పోరాటానికి అండగా వుంటానని తెలిపారు.

పోలింగ్ లో 90శాతం అక్రమాలు జరిగాయన్న పాల్

పోలింగ్ లో 90శాతం అక్రమాలు జరిగాయన్న పాల్

చంద్రబాబు ఎన్నికల్లో 30 శాతం అవకతవకలు జరిగాయని అంటున్నారని కానీ ఆ శాతం మరింత ఎక్కువగానే ఉందన్న కేఏ పాల్ తన అంచనా ప్రకారం 90 శాతం అక్రమాలు జరిగాయని,కేవలం పది శాతమే నిజాయితీగా, పారదర్శకంగా పోలింగ్ సాగినట్లు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రవర్తించిందని , ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం శుక్రవారం ఆయన డిల్లీకి వెళ్ళారు పాల్ .

ఓట్లు వైసీపీకి పడేలా ఈవీఎం మిషన్లలో చిప్ మార్చారన్న పాల్

ఓట్లు వైసీపీకి పడేలా ఈవీఎం మిషన్లలో చిప్ మార్చారన్న పాల్

దేశ విదేశాల్లో పలుకుబడి వున్న తనను చూస్తే ప్రధాని మోదీ భయపడిపోతారని పేర్కొన్నారు. జగన్ సీఎం అవుతాడో లేదో తెలీదు కానీ తమిళనాడు మాజీ సీఎం జయలలిత మాదిరిగా జైలుపాలవడం మాత్రం ఖాయమన్నారు.ఏపిలో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆయన వైఎస్సార్‌సిపికి అనుకూలంగా ఓట్లు పడేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ఈవీఎం మిషన్లలో వుండే ఓ చిప్ ను మార్చినట్లు తెలిపారు.

బాబుకు మద్దతిచ్చి ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తానన్న పాల్

బాబుకు మద్దతిచ్చి ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తానన్న పాల్

దీని వల్ల హెలికాప్టర్ కు పడాల్సిన ఓట్లు ఫ్యాన్ కు పడ్డాయని...చాలా మంది ఇదే విషయాన్ని తనకు చెప్పినట్లు పాల్ వెల్లడించారు. తాను కూడా ఈ ఎన్నికల్లో అవకతవకలపై చంద్రబాబు మాదిరిగానే డిల్లీ వేధికగా పోరాటం చేస్తానని పాల్ వెల్లడించారు. మొత్తానికి పాల్ కూడా చంద్రబాబుకు మద్దతిచ్చి ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తానని వెల్లడించారు. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్ళారు .

English summary
AP CM Chandarbabau naidu is going to delhi on 13th april to meet ECI to discuss about the failures of polling held in AP . At the same time K.A Paul also supporting chandrababu's version on ECI. Paul went to delhi as he also want to question the ECI. K.A Paul commented about the tampering of EVM's . He suspected that 90% polling manipulated .AP CEO Dwivedi worked for the YCP . Paul also went to Delhi and he also planning to protest .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X