వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేఏ పాల్ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌..! గెలుస్తాన‌న్న భ‌యంతో అదికారుల కుట్ర చేసారన్న పాల్..!

|
Google Oneindia TeluguNews

పశ్చిమ గోదావరి/హైద‌రాబాద్ : ప‌్ర‌జాశాంతి అధినేత కే ఏ పాల్ మ‌రో సారి క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఎన్ని‌ల అదికారులు త‌న గెలుపును నివారించేందుకు కుట్ర చేసార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటి మధ్యాహ్నం తో ముగిసింది. తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు అనుకోని ఘటన ఎదురైంది. అతని నామినేషన్ ని అధికారులు తీసుకోలేదు. దీంతో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని వారిపై కేఏ పాల్ మండిపడ్డారు. భీమవరంలో కేఏ పాల్ నామినేషన్‌ను వేసేందుకు వచ్చారు. కానీ అప్ప‌టికే కాలాతీతం ఐన‌ట్టు పాల్ గ్ర‌హించ‌లేక ఎక్కెక్కి ఏడ్చేసారు.

ka pal nomination rejected..! ka pal fired on election officials..!!

కేఏ పాల్ నాినేషన్ వేసే సమయం ముగియడంతో ఆయ‌న నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. నరసాపురంలో ఎంపీ నామినేషన్‌ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్‌ ఆరోపించారు. ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానో అన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ ప్రత్యర్ధి పార్టీ నాయకుల్ని విమర్శించారు. ఇదిలా ఉండగా ఎపీగా నరసాపురంలో గెలిచి నేనేంటో చూపిస్తానని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. ఆలస్యంగా వచ్చిన కారణంగానే పాల్ నామినేషన్‌ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాల్ కాసేపు భావోద్వేగానికి గుర‌య్యారు.

English summary
KA Paul has criticized the rival leaders of the party saying that Bhimavaram was late for fear of winning where he would win. Meanwhile, KA Paul made it clear that he would show victory in Narasapuram as an MP. Officials have suggested that Paul's nomination has been rejected because of the delay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X