వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KA Paul: చివరకు కేసీఆర్‌కే కరోనా.! రఘురామ చంపేస్తానని బెదిరింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి.. విమర్శలు ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ, క్రైస్తవుల మధ్య గొడవపెట్టాలని ఎంపీ రఘురామ చూస్తున్నారని ఆరోపించారు.

చంపేస్తానని బెదిరించారు..

చంపేస్తానని బెదిరించారు..

అంతేగాక, ఏపీలో మత మార్పిడి చట్టాన్ని తీసుకురావాలని గతంలో డిమాండ్ చేశారని, దీన్ని తాను ఖండించినట్లు పాల్ తెలిపారు. దీంతో ఎంపీ రఘురామ తన అసిస్టెంట్‌కు ఫోన్ చేసి చంపేస్తానని హెచ్చరించారని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి వారిని ప్రపంచంలో చాలా మందిని చూశానని, నన్ను చంపడానికి ప్రయత్నిస్తే.. వారే పోతారని వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎంపీ రఘురామ గురించి తాను ప్రార్థన చేస్తే.. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు వాగుతారా? అని మండిపడ్డారు. ఈ సమయంలో గొడవలెందుకు? అని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

నాతో పెట్టుకుంటే మసై పోతారు: కేఏ పాల్..

నాతో పెట్టుకుంటే మసై పోతారు: కేఏ పాల్..

తనను బెదిరించిన టెక్ట్స్ కూడా తమ దగ్గర ఉందని, దాన్ని డీజీపీకి ఇస్తే అరెస్ట్ చేస్తారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. మర్డర్ చేయిస్తా.. కొట్టిస్తా.. పాఠం నేర్పుతా..
అంటే ఎవరూ భయపడబోరని తేల్చి చెప్పారు. తనతో పెట్టుకున్నవారంతా మసైపోతారని శాపనార్థాలు పెట్టారు. ఏపీలో తనకు వ్యతిరేకంగా నిలిచిన ఏడుగురు మరణించారని స్పష్టం చేశారు.

కరోనాపై హెచ్చరించినా తెలుగు సీఎంలు పట్టించుకోలేదు..

కరోనాపై హెచ్చరించినా తెలుగు సీఎంలు పట్టించుకోలేదు..

ఇక తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిపైనా కేఏ పాల్ స్పందించారు. కరోనా గురించి తాను ఫిబ్రవరిలోనే హెచ్చరించానని, తెలుగు రాష్ట్రాల్లో తనకు ఉన్న భవంతులు, ఇతర మౌలిక సదుపాయాలను కరోనా కట్టడి కోసం వాడుకోవాలని చెప్పినా ఒక్కరూ పట్టించుకోలేదని పాల్ అన్నారు.
ఇప్పటికైనా తాను చెప్పిన విధంగా తనకు ఉన్న భవంతులను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉపయోగించుకోవాలని సూచించారు.

చివరకు కేసీఆర్‌కే కరోనా..?

ప్రస్తుతం అమెరికాలోని హూస్టన్‌లో ఉన్న పాల్.. అక్కడ్నుంచే ఓ వీడియో సందేశాన్ని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. కరోనా గురించి తాను ముందే హెచ్చరించినా తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. చివరికి కేసీఆర్‌కే కరోనా వచ్చిందని వార్తలు వస్తున్నాయన్నారు. కేసీఆర్‌కు నిజంగా కరోనా సోకితే ఆయన్ను స్వస్థపర్చమని ప్రార్థించినట్లు తెలిపారు. తాను మొదటగా చెప్పినట్లుగా భారత్‌లో కనీసం 10 శాతం మందికి కరోనా సోకుతుందన్నారు.
కరోనా మహమ్మారిని ప్రపంచం మీదకు వదిలిందంటూ చైనాపై కేఏ పాల్ మండిపడ్డారు.

English summary
ka paul sensational comments on raghurama raju and kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X