అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీమ నేతల తీరుతో బాబు ఉక్కిరిబిక్కిరి, అసంతృప్తులకు బుజ్జగింపులు

టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు రాయలసీమలో పార్టీలో నెలకొన్న విభేదాలు తలనొప్పిగా మారాయి. కర్నూల్, కడప జిల్లాల్లో చోటుచేసుకొన్న పరిణామాలు పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు రాయలసీమలో పార్టీలో నెలకొన్న విభేదాలు తలనొప్పిగా మారాయి. కర్నూల్, కడప జిల్లాల్లో చోటుచేసుకొన్న పరిణామాలు పార్టీకి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.అయితే ఈ పరిణామాల నేపథ్యంలో బాబు ఈ పరిణామాలను జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

కడప, కర్నూల్ జిల్లాలోని పార్టీ నాయకుల మధ్య చోటుచేసుకొన్న గ్రూపు తగాదాలు పార్టికి తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం కల్పించాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నాడు.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి.నాయకుల మధ్య చోటుచేసుకొన్న విభేదాల పరిష్కారం కోసం చంద్రబాబు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బజారునపడుతున్నారు నాయకులు. పార్టీ అవసరాల కంటే వ్యక్తిగత అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

జమ్మలమడుగులో నివురుగప్పిన నిప్పు

జమ్మలమడుగులో నివురుగప్పిన నిప్పు

కడప జిల్లా జమ్మల మడుగులో పార్టీ నాయకులు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డిల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి.ఆదినారాయణ రెడ్డి మంత్రిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత నెలకొన్న పరిస్థితులను రామసుబ్బారెడ్డి బాబుకు వివరించారు.

ఆదినారాయణరె్డ్డికి మంత్రి పదవిని ఇవ్వకూడదని రామసుబ్బారెడ్డి పట్టుబట్టినా ఫలితం లేకపోయింది.ఈ పరిస్థితుల్లో నామినేటెడ్ పదవిని రామసుబ్బారెడ్డికి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.

ప్రొద్దుటూరులో లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి వర్గాల బాహాబాహీ

ప్రొద్దుటూరులో లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి వర్గాల బాహాబాహీ

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి వర్గాలు బహిరంగంగానే గొడవలకు దిగుతున్నాయి.మున్సిఫల్ ఛైర్మెన్ పదవి విషయంలో ఈ రెండువర్గాలు పట్టువిడుపుల ధోరణిని అవలంభించలేదు.

దీంతో రెండు సార్లు మున్సిఫల్ ఛైర్మెన్ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం వాయిదా పడింది.ఈ ఘటనపై బాబు పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

నంద్యాల సీటు దక్కకపోతే శిల్పా జంప్

నంద్యాల సీటు దక్కకపోతే శిల్పా జంప్

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ఈ నెల 24వ, తేదిన టిడిపి ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 24వ, తేదిన శోభా నాగిరెడ్డి వర్థంతిని పురస్కరించుకొని భూమా కుటుంబం నుండి బరిలో ఎవరిని దింపనున్నారనే విషయాన్ని భూమా కుటుంబం ప్రకటించనుంది.అయితే అదే రోజున శిల్పా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.నంద్యాల అసెంబ్లీ స్థానంలో తాను పోటీచేస్తానని శిల్పా తేగేసి చెప్పారు.బుదవారం నాడు బాబుతో శిల్పా సోదరులు సమావేశమయ్యారు.అయితే ఈ సమావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని బాబు శిల్పాకు సూచించారు.
2.సంప్రదాయాలను ప్రస్తావిస్తున్న నేతలు

సంప్రదాయాలను ప్రస్తావిస్తున్న నేతలు

సంప్రదాయాలను ప్రస్తావిస్తున్న నేతలు

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీచేశారు. వైసీపి నుండి భూమా నాగిరెడ్డి పోటీ చేశారు. భూమా విజయం సాధించారు. గుండెపోటుతో భూమా నాగిరెడ్డి మరణించడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి.అయితే ఇటీవల కాలంలో భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు.అయితే సంప్రదాయం ప్రకారంగా ఈ స్థానం నుండి పోటీచేసే అవకాశం కల్పించాలని శిల్పా మోహన్ రె్డ్డి కోరుతున్నారు.మరో వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబం నుండి పోటీకి అవకాశం కల్పించాలని భూమా కుటుంబం కోరుతోంది.

English summary
Kadapa and Kurnool district party internal issues headache to babu.silpa Mohanreddy will contest in Nandhyal by polls. Proddatur former MLA's varadarajulua Reddy and Linga Reddy group war continues
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X