వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్టోబర్ 1వ, తేది నాటికి కెసి కెనాల్‌కు నీరివ్వకపోతే నిరహరదీక్ష: వైఎస్

By Narsimha
|
Google Oneindia TeluguNews

మైదుకూరు:కెసి కెనాల్ ఆయకట్టుకు నీరు అందించే విషయమై అక్టోబర్ రెండవ తేది వరకు ప్రభుత్వం నుండి స్పష్టత ఇవ్వకపోతే అక్టోబర్ రెండవ తేది నుండి 48 గంటల పాటు రిలే నిరహరదీక్ష చేయనున్నట్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు.

మైదుకూరులో నిర్వహించిన ధర్నాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 864.3 అడుగులు నీరు వచ్చినా ఇంత వరకు ఐఏబీ మీటింగ్‌ పెట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐఏబీ మీటింగ్‌ పెట్టి కేసీ ఆయకట్టుకు నీరు ఇచ్చే అంశంపై సరైన సమాధానాన్ని రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Kadapa Mp Avinash reddy demands government release water Kc canal

ప్రభుత్వానికి అక్టోబర్‌ 1వ తేది వరకు గడువు ఇస్తున్నాం. కేసీ ఆయకట్టుకు నీరు అందించే విషయంపై స్పష్టత ఇవ్వకపోతే అక్టోబర్‌ 2 ఉదయం నుంచి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రకటించారు.

శ్రీశైలం జలాశయంలో 854 అడుగులు నీరు కచ్చితంగా నిల్వ ఉంచాలని నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవోను తెచ్చారు. అయితే ప్రస్తుతం 864 అడుగులు నిండినా కేసీ రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ నేతలు.

English summary
Kadapa Mp Ys Avinash reddy demanded government to Release water Kc canal. If governament didnot release water till Oct 1, I will going to hunger strike said Kadapa Ys Avinash reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X