కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీలోకి కడప జిల్లా ముఖ్య నేతలు - సీట్లు ఖరారు..!?

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీల్లో జంపింగ్స్ పెరిగాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో టీడీపీలోకి ఇద్దరు సీనియర్ల ఎంట్రీ ఖాయమైంది. ఆ ఇద్దరికీ సీట్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. టీడీపీ - జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఇప్పటి వరకు పార్టీల్లో చేరికల కోసం వేచి చూస్తున్న నేతలంతా అప్రమత్తం అవుతున్నారు. వేచి చూద్దామని భావించినా వారు ముందుకు కదులుతున్నారు. కడప జిల్లా పైన ఈ సారి టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం చేరేందుకు సిద్దమైన ఇద్దరు నేతలు ఉగాది ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర వేళ మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

టీడీపీలోకి డీఎల్ - వీర శివారెడ్డి..

టీడీపీలోకి డీఎల్ - వీర శివారెడ్డి..


ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో చేరికల పైన టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో ఇద్దరు సీనియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంత కాలంగా సీఎం జగన్.. వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్న డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరటం ఖరారైంది. డీఎల్ 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తన్న వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం స్పందించింది. ఆయన అసలు వైసీపీలో ఉన్నట్లుగా తాము భావించటం లేదని..చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. డీఎల్ సైతం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం గురించి పదే పదే చెబుతున్నారు. అదే విధంగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. మార్చిలో తన నియోజకవర్గంలో అనుచరులతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి టీడీపీలో అధికారికంగా చేరుతామని వెల్లడించారు.

ఇద్దరికీ సీట్ల పైన హామీ ఇచ్చారంటూ

ఇద్దరికీ సీట్ల పైన హామీ ఇచ్చారంటూ


డీఎల్ రవీంద్రారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆరు సార్లు మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగానూ పని చేసారు. మైదుకూరులో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ రేసులో ఉన్నారు. ఈ సారి ఆయన తనయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే.. కడప ఎంపీగా డీఎల్ రవీంద్రా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, ఎంపీగా పోటీకి డీఎల్ సుముఖంగా లేరని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేసి..ఫలితం ఎలా ఉన్నా..అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఉంటుందనే హామీ దక్కిందని చెబుతున్నారు. అదే విధంగా వీర శివారెడ్డి గతంలోనూ టీడీపీ నుంచి రెండు సార్లు..కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కమలాపురం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కమలాపురం లో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్ల వీర శివారెడ్డి కమలాపురం నుంచి టీడీపీ టికెట్ పైన హామీ వచ్చాకే పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం.

టీడీపీ - జనసేన పొత్తు వేళ సీట్ల టెన్షన్

టీడీపీ - జనసేన పొత్తు వేళ సీట్ల టెన్షన్


వచ్చే ఎన్నికలకు సంబంధించి నేతల్లో సీట్ల టెన్షన్ పెరిగిపోతోంది. టీడీపీ - జనసేన పొత్తుతో తెలుగు దేశం సీనియర్లలో ఎక్కువగా ఈ టెన్షన్ కనిపిస్తోంది. పొత్తులో ఏ స్థానాలు జనసేనకు వెళ్తాయనే ఉత్కంఠ వారిని వెంటాడుతోంది. కడప జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలు దక్కించుకుంది. ఈ సారి కడప జిల్లాలో టీడీపీ కొత్త వ్యూహాల అమలుకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు డీఎల్ రవీంద్రారెడ్డి, వీర శివారెడ్డి చేరిక ఖాయమైంది. అదే విధంగా టికెట్ల హామీ దక్కిందని నేతలు చెబుతున్నా.. వైసీపీలో జిల్లాలో సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తారా..మార్పులు ఉంటాయా అనేది తేలిన తరువాతనే టీడీపీ అభ్యర్దులు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లాలో జనసేనకు సీట్లు కేటాయించే అవకాశాలు లేవని చెబుతున్నారు.

English summary
Ahead of Assembly Elections TDP Foucs on CM Jagan own District Kadapa, key leaders from Kadpa willing to join in Ugadi in coming days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X