వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్ లోపాలు ఎత్తి చూపితే..: కాకాని ఫైర్, పోలీసుల ఎదుట జగన్ పార్టీ నేత

త‌మ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం ఏమిటని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం మండిప‌డ్డారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: త‌మ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం ఏమిటని వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం మండిప‌డ్డారు.

పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్ పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్

మంత్రి నారా లోకేశ్ లోపాలను ఎత్తిచూపితే ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. త‌మ‌ను నేరుగా ఎదుర్కోలేకే టిడిపి ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్పడుతోందన్నారు.

ప్రశ్నిస్తే తప్పేంటి

ప్రశ్నిస్తే తప్పేంటి

ఇలాంటి దాడులు నిర్వ‌హించి, అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని కాకాని అన్నారు. ఈ విష‌యంపై తమ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిని, పోలీసులను ప్రశ్నిస్తే తప్పేముందన్నారు.

జగన్‌పై విమర్శలా..

జగన్‌పై విమర్శలా..

త‌మ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన మంత్రి సోమినేని చంద్ర‌మోహ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లకు దిగుతున్నార‌ని, చంద్రబాబు వద్ద మెప్పు పొందేందుకే ఆయ‌న అలా చేస్తున్నారన్నారు.

చందాల రెడ్డి అంటేనే సోమిరెడ్డిని గుర్తిస్తున్నారు

చందాల రెడ్డి అంటేనే సోమిరెడ్డిని గుర్తిస్తున్నారు

రాష్ట్రంలో సోమిరెడ్డి అంటే ఎవరూ గుర్తుపట్టడం లేదని, చందాలరెడ్డి అంటే మాత్రం వెంటనే గుర్తు ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఆ విధంగానే ఆయ‌న‌ అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

పోలీసుల ఎదుట హాజరైన మధుసూదన్ రెడ్డి

పోలీసుల ఎదుట హాజరైన మధుసూదన్ రెడ్డి

పొలిటికల్‌ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ కేసులో వైసిపి ఐటీ విభాగం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మంగళవారం తుళ్లూరు పోలీసుల ఎదుట హాజరయ్యారు.

రవికిరణ్‌తో మధుసూదన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీచేశారు.

మరోవైపు పోలీసుల నోటీసుతో రవికిరణ్‌ కూడా ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. రవికిరణ్‌ నుంచి పూర్తి సమాచారం రాకపోవడంతో మరోసారి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, విచారణ అనంతరం మ‌ధుసూద‌న్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ర‌వికిర‌ణ్ కు తమ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. అంతేగాక‌, భ‌విష్య‌త్తులో సోష‌ల్ మీడియాలో మ‌రిన్ని పోస్టులు చేస్తామ‌న్నారు. టీడీపీ అధికార వెబ్‌సైట్‌లోనూ వైసీపీ అధినేత‌ జ‌గ‌న్‌ను అవ‌మానిస్తూ పోస్టులు చేశార‌న్నారు. అయితే, తాము ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని వ్యాఖ్యానించారు. కాగా, మ‌ధుసూద‌న్‌రెడ్డిని ఈ నెల 30న మ‌రోసారి విచారిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

English summary
MLA Kakani Goverdhan Reddy on Tuesday lashed out at TDP government for targetting YSRCP IT wing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X