వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పవన్‌కి ఏ అత్తింటికి వెళ్లాలో తెలియదు!-టీడీపీపై మహా కుట్ర’

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు సభలో చేసిన విమర్శలపై టీడీపీ నేతలు ఎదురుదాడిని కొనసాగిస్తున్నారు. బీజేపీ తెరవెనుక చేస్తున్న కుట్రలో భాగంగా సాక్షి స్క్రిప్టును పవన్‌కళ్యాణ్‌ వల్లించాడని ఆక్షేపించారు.

Recommended Video

చిరంజీవి కాంగ్రెస్ కు, పవన్ కళ్యాణ్ ఎవరికో : పవన్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ !

మోడీ! ఎందుకిలా?, వైసీపీ కుట్ర, పవన్‌పై నిఘా, బీజేపీ ఓడిపోయిందని..: బాబు ఆవేదనమోడీ! ఎందుకిలా?, వైసీపీ కుట్ర, పవన్‌పై నిఘా, బీజేపీ ఓడిపోయిందని..: బాబు ఆవేదన

తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకే ఈ మహా కుట్ర జరుగుతోందంటూ వారు ఆరోపిస్తున్నారు. బీజేపీపైనా పలువురు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. బీజేపీతో పొత్తు లేకుంటే 128సీట్లు వచ్చేవని అన్నారు.

 తెరవెనుక కుట్ర

తెరవెనుక కుట్ర

హక్కుల సాధన ఉద్యమాన్ని నీరు గార్చటం కోసమే పవన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు. రాష్ట్రాభివృదికి ఏం చేస్తారో పవన్‌ చెప్పలేదని.. ఎవరో రాసిన స్క్రిప్టును చదివి వినిపించారన్నారు. తెరవెనుక కుట్రలో భాగంగానే పవన్ ఆ విధంగా మాట్లాడాడని మండిపడ్డారు. హోదా కోసం ఇద్దరు మంత్రులు కేంద్రంలో రాజీనామా చేసి పోరాడుతుంటే పవన్‌కు కనపడటంలేదా? అని కళా ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి కలసి కట్టుగా వెళ్లే తరుణంలో పవన్ ఇలా మాట్లాడటం దేనికి సంకేతమని నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏమిటి.. పవన్ మాట్లాడిందేమిటంటూ మండిపడ్డారు.

పవన్! ఆంతర్యమేంటి? మమ్మల్నే తిడతారా? లోకేష్‌పై విమర్శలా?: తొలిసారి బాబు ఆగ్రహంపవన్! ఆంతర్యమేంటి? మమ్మల్నే తిడతారా? లోకేష్‌పై విమర్శలా?: తొలిసారి బాబు ఆగ్రహం

 ఎన్నికల టైంకి కొన్ని పార్టీలు ఇలా..

ఎన్నికల టైంకి కొన్ని పార్టీలు ఇలా..

శేఖర్‌రెడ్డితో లోకేశ్‌కు ఎలాంటి సంబంధాలు లేవని.. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సిఫార్సుతో అతడిని టీటీడీ బోర్డులో స్థానం కల్పించినట్లు కళా వెంకట్రావ్ చెప్పారు. ఎన్నికలు వచ్చే సమయంలో కొన్ని పార్టీలను తయారు చేయడం కొందరికి అలవాటని ఎద్దేవా చేశారు. లోకేష్ తన పని తాను చేసుకుంటుంటే లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. చంద్రబాబు కష్టానికి మారు పేరని కళా వెంకట్రావ్‌ అన్నారు.

‘పవన్‌కి కౌంట్‌డౌన్! అన్న కాంగ్రెస్‌కి.. తమ్ముడెవరికో?-చిరుతో 20ఏళ్లు వెనక్కి'‘పవన్‌కి కౌంట్‌డౌన్! అన్న కాంగ్రెస్‌కి.. తమ్ముడెవరికో?-చిరుతో 20ఏళ్లు వెనక్కి'

 అస్థిరపర్చేందుకే పవన్.. సాక్షి స్ట్రిప్టే

అస్థిరపర్చేందుకే పవన్.. సాక్షి స్ట్రిప్టే

కేంద్రంపై పోరాడాల్సిన తరుణంలో రాష్ట్రాన్ని అస్థిర పరిచేలా పవన్‌కళ్యాణ్‌ వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఏమీ అనకుండా రాష్ట్రం ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడంపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందంటూ నాలుగేళ్ల తరువాత మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌ మాటకు తెలుగుదేశం పార్టీ చాలా విలువ ఇచ్చిందని.. ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని తెలిసినప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లోకేశ్‌పై ఆరోపణలు చేశారని.. పవన్‌ ప్రసంగం సాక్షి పత్రిక చదివి మాట్లాడినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

 పవన్‌కు అత్తారింటికి దారి తెలియడం లేదు

పవన్‌కు అత్తారింటికి దారి తెలియడం లేదు

మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదని పవన్‌పై సెటైర్లు వేశారు. టీడీపీపై బురద జల్లడం మానుకోవాలని దుయ్యబట్టారు. పవన్‌కు అత్తారింటికి దారేదో తెలియదు.. ఏ అత్తింటికి పోవాలో తెలియదు అని ఆది నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అన్నారు.

English summary
Andhra Pradesh ministers Kala Venkata Rao and Adinarayana Reddy lashes out at Janasena President Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X