వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జగన్ పార్టీ అడ్రస్ గల్లంతే! చంద్రబాబుకు స్పష్టమైన మద్దతు’

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనం విజయం సాధించడం పట్ల టీడీపీ మంత్రులు, నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనం విజయం సాధించడం పట్ల టీడీపీ మంత్రులు, నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడారు. కాకినాడ ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సమర్థతకు సంకేతమని అన్నారు.

చంద్రబాబు కష్టం చూసే..

చంద్రబాబు కష్టం చూసే..

గత మూడున్నరేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చంద్రబబు చేరువయ్యారని, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసిన ప్రజలు ఓటు రూపంలో ఇచ్చిన తీర్పే ఈ విజయమని వెంకట్రావ్ అన్నారు. ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళతానని అన్నారు.

జగన్ పార్టీ గల్లంతే..

జగన్ పార్టీ గల్లంతే..

ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల అవాస్తవ ప్రకటనలు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేశామని, తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశామని చెప్పారు.

సీఎం పనితనానికి నిదర్శనం

సీఎం పనితనానికి నిదర్శనం

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు సీఎం చంద్రబాబు పనితనానికి నిదర్శనమని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ ఎన్నికల్లో గెలుపునకు కాపు సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు మద్దతు తెలపడమే కారణమని అన్నారు.

జగన్ పార్టీ దిగజారినా..

జగన్ పార్టీ దిగజారినా..

కాకినాడలోని కాపు సామాజిక వర్గం టీడీపీకే స్పష్టమైన మద్దతు తెలిపిందని చెప్పారు. ప్రతిపక్షం ఎన్ని ఎత్తులు వేసినా దిగజారుడు రాజకీయాలకు పాల్పడినా ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారనేది కాకినాడ ఎన్నికల్లో విజయం స్పష్టం చేస్తోందని తెలిపారు.

English summary
Andhra Pradesh minister and TDP president kala venkata rao responded on kakinada corporation elections results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X