వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ నీకు సిగ్గుగా అనిపించ‌టం లేదా: కెసిఆర్ కు ఎందుకు మ‌ద్ద‌తు : జ‌గ‌న్ కు క‌ళా లేఖ‌..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ టిఆర్‌య‌స కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తిచ్చార‌ని విమ‌ర్శిస్తూ వ‌చ్చిన టిడిపి నేత‌లు ఇప్పుడు లేఖ ల ద్వారా త‌మ స్వ‌రం మ‌రింత‌గా పెంచారు. కెసిఆర్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌టం అంటే ఏపి ప్ర‌జ‌ల‌ను వంచిచ‌ట‌మే అని త‌మ లేఖ‌ల్లో పేర్కొంటున్నారు. ఇప్ప‌టి దాకా మంత్రులు..పార్టీ నేత‌లు జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని చేస్త‌న్న విమ‌ర్శ‌ల ను ఏపి టిడిపి అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట‌రావు ఓ లేఖ ద్వారా జ‌గ‌న్ ను ప్ర‌శ్నించారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌కు జగన్‌ మద్దతివ్వడం నవ్యాంధ్ర ప్రజలను వంచించడమేనని లేఖ లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్న కేసీఆర్‌కు ఎందుకు మద్దతిస్తున్నారు.. అని లేఖ ద్వారా జగన్ ను ప్రశ్నించారు. తెలుగు తల్లిని కించపరిచిన కేసీఆర్ కు మద్దతివ్వటం సిగ్గుగా అనిపించట్లేదా..హోదాకు అడ్డుపడ్డ టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో చెవిరెడ్డి, విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారన్నారు.

Kala Venkata Rao open letter to Jagan : Questioned support for KCR.

కూకట్ పల్లిలో గెలిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ బహిరంగ ప్రకటన చేయటం వాస్తవం కాదా..అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేయటమే వైసీపీ రహస్య అజెండానా.. అని ఆయన లేఖలో ప్ర‌శ్నించారు. కాగా, మంత్రులు సైతం జ‌గ‌న్ పై ఇదే ర‌క‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కెసిఆర్‌..బిజెపి తో కుమ్మ‌క్కై జ‌గ‌న్ ఏపిలో ప్ర‌భుత్వం పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

టిడిపి ఈ ర‌కంగా విమ‌ర్శ‌లు చేస్తుంటే..ఇదే అంశం పై వైసిపి నేత బొత్సా స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. తొలుత కెసిఆర్ తో క‌లిసేందుకు ముఖ్య‌మంత్రి మొగ్గు చూపార‌ని గుర్తు చేసారు. తాము ఎవ‌రి మ‌ద్ద‌తు కోర‌టం లేద‌ని.. టిడిపి ని వ్య‌తిరేకించే పార్టీగా వారు ఓడిపోవాల‌ని కోరుకున్నామ‌ని వివ‌రించారు. పొత్తుల కోసం టిడిపి త‌హ‌త‌హ‌లాడుతుంద‌ని.. తాము ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేసారు. కెసిఆర్ వ్యాఖ్య‌ల ద్వారా..ఇప్పుడు ఏపి లో టిడిపి -వైసిపి మ‌ధ్య మాట‌ల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది.

English summary
AP Teleugudesam President Kala Venakta Rao fire on Jagan. He wrote a open letter and questioned jagan about his support for KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X