• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కృష్ణా-గుంటూరు టీచర్స్ ఎమ్మెల్సీగా కల్పలత రెడ్డి విజయం

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్వలత గెలుపొందారు.

 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడే... అన్ని ఏర్పాట్లు పూర్తి... ఓట్లను ఎలా లెక్కిస్తారంటే...? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేడే... అన్ని ఏర్పాట్లు పూర్తి... ఓట్లను ఎలా లెక్కిస్తారంటే...?

విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడంతో కల్పలత రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 6153 ఓట్ల దాటగానే కల్పలత విజయం సాధించారని తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 6153 రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6153 ఓట్లు సాధించడంతో కల్పలత గెలుపొందినట్లు ప్రకటించారు.

Kalpalatha Reddy elected MLC from Krishna-Guntur Teachers constituency

ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా కల్పలత మీడియాతో మాట్లాడారు. తన విజయం కోసం కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను స్థానికురాలిని కాదనే అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదని కల్పలత వ్యాఖ్యానించారు.

కాగా, ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. షేక్ సాబ్జీకి 7983 ఓట్లు రాగా, నారాయణకు 6446 ఓట్లు వచ్చాయి.

English summary
T.Kalpalatha Reddy was elected to the State Legislative Council from Krishna-Guntur districts Teachers constituency in Guntur district on Wednesday mid-night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X