వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు బుధవారం సికింద్రాబాదులోని రైల్వే కోర్టుకు హాజరయ్యారు. సకల జనుల సమ్మె సందర్భంగా రైలో రోకో కార్యక్రమం నిర్వహించినందుకు కేసులు నమోదయ్యాయి. ఉద్యమకారులపై నమోదైన కేసుల విచారణలో భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు.

జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ సందర్భంగా సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మేకప్... ఆ తర్వాత పేకప్ చేసే వారి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు.

కేసులన్నీ మాఫీ అయ్యాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు చెప్పారని, ఇప్పటికీ ఉద్యమ కారులు కోర్టుల చుట్టు తిరుగుతున్నారని ఆమె అన్నారు. ఇప్పటికైనా చిత్త శుద్ధి ఉంటే తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కవిత డిమాండ్ చేశారు.

కోర్టుకు కవిత 1

కోర్టుకు కవిత 1

తెలంగాణ సకల జనుల సమ్మె సందర్భంగా జరిగిన రైల్ రోకో కార్యక్రమం నిర్వహించినప్పుడు నమోదైన కేసుల విచారణ సందర్భంగా కల్వకుంట్ల కవిత బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు వచ్చారు.

కోర్టుకు కవిత

కోర్టుకు కవిత

సికింద్రాబాదు రైల్వే కోర్టుకు వచ్చిన కల్వకుంట్ల కవిత ఇలా కనిపించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెసువారు దాన్ని అమలు చేయలేదని ఆమె విమర్సించారు.

కోర్టుకు కవిత

కోర్టుకు కవిత

సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు వచ్చిన కల్వకుంట్ల కవిత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సైటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు

కోర్టుకు కవిత 4

కోర్టుకు కవిత 4

సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు వచ్చిన కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆమె అన్నారు.

English summary
Telangana Jagruthi president and Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao's daughter Kalwakuntla Kavitha came to secunderabad railway court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X