వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కచ్చితంగా తిరగబడుతా.. దమ్ముంటే ఆ మాట పవన్‌తో చెప్పించండి: కల్యాణ్ దిలీప్ సుంకర సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అంటే పవన్ కల్యాణ్ 'వన్ మాన్ షో'. ఆ పార్టీ పట్ల ఇప్పటికీ ఇదే చాలామంది అభిప్రాయం. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు పవన్ కాకుండా మరో ముఖమేది తెర పైకి రాలేదు. అయితే 'కల్యాణ్ దిలీప్ సుంకర' అనే వ్యక్తి మాత్రం తనను తాను జనసేన అభిమానిగా క్లెయిమ్ చేసుకుంటూ.. చాలావరకు డిబేట్లలో పాల్గొంటూ వచ్చాడు. ఒకరకంగా జనసేన వాదనను పవన్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వినిపించింది దిలీపే. కానీ ఇప్పుడా దిలీప్ ను పార్టీ నుంచి గెంటేసే పరిస్థితి?

నిజమేనా?: పవన్ కల్యాణ్‌కు దిలీప్ సుంకర దూరం నిజమేనా?: పవన్ కల్యాణ్‌కు దిలీప్ సుంకర దూరం

ఇంతకీ ఏమైంది:

ఇంతకీ ఏమైంది:

నిన్న మొన్నటిదాకా పవన్ తర్వాత జనసేన జెండాతో అంతగా ఫోకస్ అయిన కల్యాణ్ దిలీప్ సుంకర.. అకస్మాత్తుగా పార్టీతో తెగదెంపులకు సిద్దపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పార్టీ నుంచి తనను గెంటివేయడానికి పదేపదే జరుగుతున్న కుట్రలను ఇక సహించలేకనే తాను బయటకి వెళ్లడానికి సిద్దపడినట్టు కల్యాణ్ దిలీప్ క్లారిటీ ఇచ్చేశారు. ఆత్మాభిమానాన్ని చంపుకునే వ్యక్తిని కాదని.. అవసరమైతే కచ్చితంగా తిరగబడుతానని హెచ్చరించారు.

బోకు రాజకీయాలా?

బోకు రాజకీయాలా?

టీవి డిబేట్లలో కనిపించాలని తాను ఏనాడు ఉబలాటపడిపోలేదని,తాను పాల్గొన్న చివరాఖరి డిబేట్ కూడా మీడియా వాళ్లు పిలిస్తేనే వెళ్లానని కల్యాణ్ చెప్పుకొచ్చారు.
వెళ్లేముందు పవన్ ఫ్యాన్స్‌కు, జనసేన మిత్రులకు చెప్పే వెళ్లానని స్పష్టం చేశారు. ఇన్నాళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా.. కనీస గుర్తింపు లేకపోగా.. పదేపదే పార్టీతో కల్యాణ్ దిలీప్ సుంకరకు సంబంధం లేదన్న స్టేట్‌మెంట్స్ ఇవ్వడం బాధించిందన్నారు.

పవన్‌కు నచ్చుతాయేమో కానీ..:

పవన్‌కు నచ్చుతాయేమో కానీ..:

గత నాలుగేళ్ల నుంచి తాను డిబేట్లలో పాల్గొంటుంటే.. 93వ డిబేట్ తర్వాత 'కల్యాణ్ తో మాకు సంబంధం లేదు' అంటూ జనసేన నుంచి ప్రకటనలు రావడం తనను ఆవేదనకు గురిచేసినట్టుగా చెప్పుకొచ్చారు. తాను ఏదో ఆశించి పార్టీలోకి రాలేదని, ఒకవేళ ఆశించి ఉంటే తన స్ట్రాటజీ వేరుగా ఉండేదని అన్నారు.

పార్టీలోని కొంతమంది వ్యక్తుల లుచ్చా రాజకీయాలను ఇక సహించలేనని, ఆ రాజకీయాలు పవన్ కు నచ్చుతాయేమో కానీ తనకు కాదని స్పష్టం చేశారు. బోకు రాజకీయాలు చేస్తూ వెన్నుపోటు పొడిచే వెధవల్లారా? అంటూ కల్యాణ్ తీవ్ర స్థాయిలో వారిపై మండిపడ్డారు.

మహేష్ కత్తి వివాదంపై..:

మహేష్ కత్తి వివాదంపై..:

జనసేన నుంచి ఎలాగైనా తప్పించాలన్న ఉద్దేశంతో తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని కల్యాణ్ వాపోయారు. మహేష్ కత్తి అనే వ్యక్తిని తానే తెర పైకి తెచ్చి, పథకం ప్రకారం ఆయనతో డ్రామా రక్తి కట్టించి.. చివరకు కథను సుఖాంతం చేసి క్రెడిట్ కొట్టేశాడని కొంతమంది తనపై ఆరోపణలు చేస్తున్నారని కల్యాణ్ అన్నారు. పార్టీ మంచి కోసమే తాను మహేష్ కత్తితో రాజీ ప్రయత్నాలను కుదిర్చాను తప్ప.. అందులో ఏ స్వార్థమూ లేదన్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజశేఖర్ పై దాడి జరిగితే.. ఆయన సామాజిక వర్గమైన శెట్టి బలిజలు ఆ పార్టీకి ఓటేయలేదని, అలాంటి పరిస్థితులు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే తాను ఆ పని చేశానని చెప్పుకొచ్చారు.

యాక్సిడెంట్ జరిగితే..:

యాక్సిడెంట్ జరిగితే..:

ఇటీవల రోడ్డు ప్రమాదంలో తాను గాయపడితే.. అది కూడా కావాలనే చేయించుకున్నానని కొంతమంది మాట్లాడుతుండటం తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. పవన్ కల్యాణ్ నుంచి సానుభూతి దొరుకుతుందన్న ఉద్దేశంతోనే తాను కావాలని యాక్సిడెంట్ చేయించుకున్నట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

బొచ్చులో ఫైల్?:

బొచ్చులో ఫైల్?:

ఇక మరికొంతమంది కల్యాణ్ దిలీప్ సుంకర అవినీతిపరుడని, అతనికి సంబంధించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందని, అందుకే పవన్ కల్యాణ్ అతన్ని దూరం పెడుతున్నాడని ఏదేదో ప్రచారం చేస్తున్నారని కల్యాణ్ అన్నారు. ఎవడు చూడు.. 'అందుకే కల్యాణ్ దిలీప్ ను దూరం పెట్టారట', 'ఇందుకే పవన్ రానివ్వడం లేదట' అంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు సంబంధించి ఏ బొచ్చులో ఫైల్ ఎక్కడా లేదని, తాను ఏ అవినీతిలోనూ ఇరుక్కోలేదని తేల్చి చెప్పారు.

దమ్ముంటే పవన్‌తో చెప్పించండి:

దమ్ముంటే పవన్‌తో చెప్పించండి:

ఇటీవల టీవి చానెళ్లకు ఫోన్లు చేసి మరీ.. కల్యాణ్ ను డిబేట్లకు పిలవొద్దు అంటూ కొంతమంది చెబుతున్నారని కల్యాణ్ అన్నారు. 'మేము పెట్టిన మహాద్భుతమైన ప్యానెల్ ఉండగా.. కల్యాణ్ ఎవడండి?' అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఇన్నాళ్లుగా పవన్ తో కనీసం ఒక్క ఫోటో దిగుదామని ప్రయత్నించినా.. తనను పార్టీ ఆఫీసులోకి కూడా రానివ్వలేదని ఆరోపించారు. వాళ్లు వీళ్లు చెప్పడం కాదని, దమ్ముంటే పవన్ కల్యాణ్ చేత 'జనసేనకు కల్యాణ్ దిలీప్ సుంకరకు సంబంధం లేదు' అన్న ప్రకటన చేయించాలని ఆయన సవాల్ విసిరారు.

జనసేన తనను దూరం పెట్టినంత మాత్రానా తనకేమి నష్టం లేదని, గంతకు తగ్గ బొంత లాగా మరో పార్టీలోకి వెళ్లి కష్టపడి పనిచేసి నిరూపించుకునే సత్తా తనకు ఉందని కల్యాణ్ స్పష్టం చేశారు.

English summary
Kalyan Dileep Sunkara, who is Pawan Kalyan fan was made some allegations on Janasena party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X