శుభాకాంక్షలు చెప్పలేను: బాబు దీక్షపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

చెన్నై/విజయవాడ: విభజన హామీలు నెరవేర్చలేదంటూ కేంద్రం వైఖరికి నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ధర్మపోరాట దీక్ష పేరుతో ఒకరోజు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కేంద్రం తీరుకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరాహార దీక్ష ప్రారంభం
'సర్.. మీరు మీ పుట్టిన రోజున మీ రాష్ట్రం కోసం దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో నేను ఎప్పుడూ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్లే ఇప్పుడు చెప్పలేను. కానీ, ఈ పోరాటంతో మీరు విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని కమల్ హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

ఇటీవల తన రాజకీయ పార్టీ ప్రకటించినప్పుడు.. తాను చంద్రబాబు అభిమానిని అని కమల్ హాసన్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేగాక, పార్టీకి ప్రారంభించడానికి ముందు చంద్రబాబుకు ఫోన్ చేసి.. ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నానని తెలిపారు. కాగా, కొత్త పార్టీ పెట్టిన కమల్ హాసన్‌కు చంద్రబాబు అభినందనలు కూడా తెలిపారు.