వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురందేశ్వ‌రి వ్యాఖ్యలపై కంభంపాటి ఫైర్

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం సరైన లెక్కలు పంపితే పోల‌వ‌రం ప్రాజెక్టుకి కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తుందని బీజేపీ నాయ‌కురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ కంభంపాటి రామ్మోహ‌న్ మండిప‌

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం సరైన లెక్కలు పంపితే పోల‌వ‌రం ప్రాజెక్టుకి కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తుందని బీజేపీ నాయ‌కురాలు దగ్గుబాటి పురందేశ్వ‌రి చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ కంభంపాటి రామ్మోహ‌న్ మండిప‌డ్డారు.

పోలవరం వివాదంపై బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

purandheswari-kambhampati

ఈ నేపథ్యంలో.. కంభంపాటి రామ్మోహ‌న్ మాట్లాడుతూ త‌ప్పుడు లెక్క‌లు చెప్పే అల‌వాటు టీడీపీకి లేద‌ని ఉద్ఘాటించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మూడేళ్లుగా అత్యంత నాణ్య‌త‌తో జ‌రుగుతున్నాయని అన్నారు. ఇప్ప‌టికే 90 శాతం మ‌ట్టిప‌నులు, 40 శాతం కాంక్రీట్ ప‌నులు జ‌రిగాయని పేర్కొన్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు మొత్తంగా 50 శాతం పూర్త‌య్యాయని, పోల‌వ‌రం నిర్మించే సామ‌ర్థ్యం రాష్ట్రానికి లేద‌న‌డం అవ‌గాహ‌న రాహిత్యమ‌ని రామ్మోహన్ పేర్కొన్నారు. సామ‌ర్థ్యం లేకపోతే మూడేళ్ల‌లో 50 శాతం ప‌నులు ఎలా పూర్తవుతాయని ఆయన ప్ర‌శ్నించారు.

English summary
TDP Leader Kambhampati Ram Mohan fired on BJP Leader Daggubati Purandheswari on Saturday. Regarding Polavaram project Purandheswari while speaking with media told if andhra pradesh government will send correct calculations on polavaram centre is ready to release funds. On her comments, Kambhampati critisized Purandheswari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X