వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనలోకి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్?...వ్యూహం ఇదేనా?...

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన బిజెపి నేత కామినేని శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఏమిటి?...ఆయన ఏం చెయ్యబోతున్నారు?...మంత్రి పదవికి రాజీనామా చేసే సమయంలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి అనేక ఊహాగానాలు చెలరేగాయి.

కామినేని శ్రీనివాస్ టిడిపికి,చంద్రబాబుకు అత్యంత అనుకూలంగా ఉంటారు కాబట్టి...ఇప్పుడైనా...లేదా తరువాతైనా ఆయన ఖచ్చితంగా టిడిపిలోకి వెళతారంటూ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఆయన జనసేనలోకి వెళ్లడం ఖాయమంటున్నారు. అంతేకాదు అలా వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు...అదేంటో తెలుసుకుందాం...

బిజెపి నేత...కానీ...బాబుకు బాగా ఫేవర్...

బిజెపి నేత...కానీ...బాబుకు బాగా ఫేవర్...

ఎన్టీఆర్ ఆహ్వానంతో టిడిపిలోకి వచ్చిన కామినేని శ్రీనివాస్ ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకే దూరంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికలలో బిజెపి అగ్ర నేత వెంకయ్యనాయుడు సూచన మేరకు బిజెపి తరుపున పోటీ చేసి విజయం సాధించి...ఆ తరువాత మంత్రి కూడా అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కీలక పదవిని చేపట్టడంతో రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. అయితే బిజెపి నేత అయినా మంత్రిగా మిగతా మంత్రుల కంటే టిడిపికి, చంద్రబాబుకు ఎక్కువ అనుకూలంగా వ్యవహరించడం ద్వారా చాలా సార్లు చర్చనీయాంశం అయ్యారు.

 వీర విధేయత...చంద్రబాబుకు నచ్చింది...

వీర విధేయత...చంద్రబాబుకు నచ్చింది...

అయితే ఆయన కూడా ఈ విషయంలో ఎప్పుడూ మొహమాటపడలేదు...బిజెపిలో చంద్రబాబు అనుకూల వర్గం నేతగా పిలిపించుకునేందుకు ఇష్టపడిన ఈ నేత బిజెపిలోకి వచ్చిన నాటి నుంచి...భాగస్వామ్య పార్టీలుగా ఆ టిడిపి-బిజెపి మెలిగిన కాలంలోనూ...తాజాగా మైత్రీబంధం తెగిపోయిన స్థితిలోనూ ఏనాడు టిడిపికి గాని...చంద్రబాబుకు గాని వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడకపోగా...ఇంకా చంద్రబాబునో, పొత్తునో సమర్థిస్తూనో మాట్లాడేవారు. అలాగే ఈ రెండు పార్టీల మధ్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలోనూ...ఆ పరిస్థితుల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్న దశలోనూ చంద్రబాబును, టిడిపి పాలనను మరింత పొగిడారే తప్ప వ్యతిరేకంగా చిన్న మాట కూడా అనలేదు. దీంతో కామినేని శ్రీనివాస్ విధేయత నచ్చిన చంద్రబాబు...ఇంత అనుకూలంగా ఉండే నేత మరెవరుంటారని... వెంకయ్య నాయుడి అనుచరుడిగా...తనకు వీర విధేయుడిగా ఉన్న కామినేని రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇప్పుడే భరోసా ఇచ్చేశారట.

 అందుకే ప్రత్యేక వ్యూహం...డ్యామేజీ కాకుండా...

అందుకే ప్రత్యేక వ్యూహం...డ్యామేజీ కాకుండా...

నిజానికి తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని శ్రీనివాస్ ఇక టిడిపిలో చేరిపోవడం లాంఛనప్రాయమేనని అందరూ భావించారు. అయితే కామినేనికి పార్టీలో స్థానం కల్పించి ఆ తరువాత సముచిత స్థానం కల్పించే విషయంలో చంద్రబాబుకు ఏ అభ్యంతరం లేకపోయినా... అలా చేస్తే కామినేని శ్రీనివాస్ ఇమేజితో పాటు చంద్రబాబు ఇమేజ్ కు కూడా వేరే రకంగా డ్యామేజీ జరిగే అవకాశం ఉందని అంచనా వేశారట. అందుకే ఎవరికీ నష్టం లేకుండా...పైగా ఉభయ తారకంగా అందరికీ లాభదాయకంగా ఉండేలా చంద్రబాబు కామినేని శ్రీనివాస్ భవిష్యత్తు కోసమే ప్రత్యేక ప్లాన్ సిద్దం చేశారట. ఈ ప్లాన్ ప్రకారం టిడిపికి, కామినేని శ్రీనివాస్ కే కాదు జనసేన పార్టీకి కూడా ప్రయోజనం చేకూరుతుందట.

 ప్లాన్ ఏంటంటే...అందరికీ లాభమే...విన్ విన్ మెథడ్

ప్లాన్ ఏంటంటే...అందరికీ లాభమే...విన్ విన్ మెథడ్

గతంలో లాగా కాపుల ఓట్లు ఏకపక్షంగా టిడిపికి పడే అవకాశం లేని నేటి పరిస్థితుల్లో...తన సర్వేలోనే తేలినట్లు వివిధ కారణాలరీత్యా టిడిపికి ఇబ్బందికరంగా ఉండే 45 నియోజకవర్గాల్లో...జనసేన పార్టీని ఆయుధంగా వాడుకోవాలని చంద్రబాబు ప్లాన్ అట. దీనిద్వారా తాను కోరుకునేవారే ఎమ్మెల్యేలుగా విజయం సాధించేటట్లు చంద్రబాబు వ్యూహం అమలుచేసే అవకాశం ఉంటుందట. ఇది టిడిపికి లాభం...మరోవైపు జనసేనకు కావాల్సిన ఆర్థికలోటు, అనుభవ లేమి...క్యాడర్ లేమి తదిదర సమస్యలను అధిగమించేందుకు ఆ పార్టీకి మంచి అవకాశం లభిస్తుంది. పవన్ కి వ్యక్తిగత ఇమేజ్ తప్ప పార్టీ పరంగా ఉన్న ఇమేజ్ చాలా తక్కువనే విషయం ఇటు చంద్రబాబుకు...అటు పవన్ కు ఇద్దరికీ తెలుసు...ఇక కామినేని లాంటి వ్యక్తి జనసేన అభ్యర్థిగా ఉండటం ఆ పార్టీకి అన్ని విధాలా లాభమే...ఇంకా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారంటే...కామినేని శ్రీనివాస్ లాంటి వారినేనట.

కామినేని...భవితకు భరోసా...

కామినేని...భవితకు భరోసా...

ఇక కామినేని శ్రీనివాస్ విషయానికొస్తే...పార్టీ ఏదనేది ముఖ్యం కాకపోవడం...ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా మళ్లీ పదవిని చేపడితే చాలు...ఇప్పుడు బిజెపి అయినా టిడిపి మంత్రిలాగా ఎలా వ్యవహరించారో అప్పుడు కూడా జనసేన నుంచి అలాగే ఉంటారు. నమ్మినవారికి అనుకూలంగా ఉండటమే తప్ప పార్టీ ఏదనే పట్టింపు లేని కామినేని శ్రీనివాస్ లాంటి సానుకూల ధోరణి, వీర విధేయులు ఎవరికైనా దొరకడం చాలా కష్టం. అందువల్ల కామినేని విషయంలో అటు టిడిపి...ఇటు జనసేన చాలా హ్యాపీగా ఉండగా...మరోవైపు మిగిలినవారి సంగతేమో కాని కామినేని శ్రీనివాస్ భవిష్యత్తుకు మాత్రం ముందే చక్కటి భరోసా లభించిందట...అయితే కామినేని జనసేనలో చేరే విషయం ఇప్పుడే ప్రకటించరట...అందరికీ అనుకూల సమయంలోనే ఆ ఎనౌన్స్ మెంట్ జరుగుతుందట. ఇదండీ...కైకలూరు ఎమ్మెల్యే...మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న తాజా ప్రచారం.

English summary
Amaravathi:What is the political future of Kaikaluru MLA, Ex Minister Kamineni Srinivas...who recently resigned to the post of Health minister? ... Will he enter in TDP as a campaign now or ... again silent?...An analysis...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X