విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కనకదుర్గమ్మ కళ్యాణ బ్రహోత్సవాలు ... నేటి నుండి ప్రారంభం

|
Google Oneindia TeluguNews

ఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కళ్యాణ బ్రహ్మోత్సవాల సంరంభం ఆరంభం అయ్యింది . అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ, సాక్షాత్ పెద్దమ్మ, దుర్గ మాయమ్మ... అని భక్త జనులందరూ కొలిచే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నేటి నుంచి ప్రారంభమై 22 వరకు కొనసాగనున్నాయి. కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు అశేష భక్తజనులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు.

నేడు మంగళ స్నానాలు ,అంకురార్పణ , ధ్వజారోహణ నిర్వహించనున్న వేదపండితులు

నేడు మంగళ స్నానాలు ,అంకురార్పణ , ధ్వజారోహణ నిర్వహించనున్న వేదపండితులు

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ బ్రహ్మోత్సవాల దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . వికారి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి చైత్ర బహుళ తదియ వరకు గంగా, పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్15 ఉదయం 8.30 గంటలకు ఉత్సవమూర్తులకు పండితులు మంగళ స్నానాలు నిర్వహించారు.అనంతరం వధూవరులుగా అలంకరణ చేసారు సాయంత్రం 4 గంటలకు వేద పండితులచే శాస్త్రోక్తంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇలా ..

బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇలా ..


16న మూలమంత్ర హవనాలు, 17న రాత్రి 8 గంటలకు రాయబార మండపంలో ఎదురుకోలు ఉత్సవం, రాత్రి 10.30 గంటలకు గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీలా కల్యాణం చేస్తారు. 18న ఉదయం 10 గంటలకు సదస్యం, వేద స్వస్తి నిర్వహిస్తారు. 19న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్య కొట్నోత్సవం, వసంతోత్సవం, ఉత్సవమూర్తులకు అవభృత స్నానం చేయిస్తారు. 20, 21, 22 తేదీల్లో మల్లేశ్వర స్వామి వారికి పంచహారతులు అనంతరం రాత్రి 9 గంటలకు పవళింపు సేవ నిర్వహిస్తారని వైదిక కమిటీ తెలిపింది.

మల్లిఖార్జున మహా మండపం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు

మల్లిఖార్జున మహా మండపం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు

ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు మల్లిఖార్జున మహా మండపం నుంచి ప్రారంభమవుతుంది. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఏప్రిల్ 15న గజవాహనం, 16న రావణ వాహనం, 17న నంది వాహనం, 18న సింహవాహనం, 19న వెండి రథంపై విజయవాడ పాతబస్తీలో ఊరేగించనున్నారు. నగరోత్సవం నిర్వహించనున్నట్టు వైదిక కమిటీ తెలిపారు.

English summary
brahmotsavam of Sri durga malleshwara Swamy temple Indrakeladri formally begun with the chanting of ‘swasthi vacahanams’ by priests on Indrakeladri hill shrine .Amid rituals and chanting of veda mantras by the temple priests, Adhi puja " ankurarapana " will be performed for Vishwakthkethu marking the commencement of brahmotsavam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X