• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్‌ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?

By Narsimha
|
  Kanigiri degree student case : అత్యాచార దృశ్యాలు యూట్యూబ్‌లో పెట్టిన మృగాళ్లు | Oneindia Telugu

  ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మిగిలిన ముగ్గురిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని బాధితురాలి తల్లి పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

  మహిళలపై అత్యాచారాలు, హింసలు జరగకుండా కఠిన చట్టాలు చేస్తోన్నా కానీ, వారిపై దారుణాలు ఆగడం లేదు ప్రతి రోజు ఏదో ఒక చోట ఈ తరహఘటనలు చోటుచేసుకొంటూనే ఉన్నాయి.

  డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్

  ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకొన్న ఘటన సభ్యసమాజం తలదించుకొనేదిగా ఉంది. సహవిద్యార్థులపై నమ్మించి బాధిత విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.

  ఈ తరహ ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తే తప్ప మరోసారి ఘటనలు పునరావృతం కావని మహిళ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కనిగిరిలో ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి ప్రజా సంఘాలు.

  కనిగిరి ఘటన వెనుక ఏం జరిగిందంటే?

  కనిగిరి ఘటన వెనుక ఏం జరిగిందంటే?

  ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన ఓ విద్యార్ధిని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. అదే కళాశాలలో కార్తీక్‌ అనే విద్యార్థితో గత రెండేళ్లుగా పరిచయం ఉంది. ఇటీవల ఆమె కార్తీక్‌ స్నేహితుడైన సాయిరామ్‌తో సన్నిహితంగా ఉంటోంది. దీన్ని కార్తీక్‌ జీర్ణించుకోలేకపోయాడు. మూడు రోజుల క్రితం ఆమెను పట్టణ శివారులోని కాశీనాయని గుడి వద్దకు రమ్మన్నాడు. బాధిత విద్యార్థిని తన స్నేహితురాలితో కలిసి కాశీనాయని గుడి వద్దకు వెళ్ళింది. అప్పటికే అక్కడ కార్తీక్‌తోపాటు ఆయన స్నేహితులు సాయిరాం, శ్రీరాంపవన్‌ ఉన్నారు. వీరంతా కలిసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. కార్తీక్‌ ఉసిగొల్పడంతో సాయిరాం ఆ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. శారీరకంగా హింసించాడు. సుమారు అరగంటపాటు ఈ కీచకపర్వం కొనసాగింది.

  సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితులు

  సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితులు

  బాధిత విద్యార్థినిపై సాయిరాం అత్యాచారయత్నానికి ప్రయత్నిస్తుండగా ఈ దృశ్యాలను అతని స్నేహితులు కార్తీక్, శ్రీరాంలు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు.అంతేకాదు నిందితుడు సాయిరాంను ప్రోత్సహించారు. అంతేకాదు బాధిత విద్యార్థినిని హింసించాలని రెచ్చగొట్టారు.

  ఆరుగురు వేధించారు.

  ఆరుగురు వేధించారు.

  తమ కుమార్తెను వేధించిన వారు ఆరుగురైతే.. ముగ్గురిపైనే కేసు నమోదు చేయటం సరికాదని బాధితురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగిలిన ముగ్గురిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ఆమె పోలీసులను ప్రశ్నించారు.తమ కుమార్తెను వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఈ తరహ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని బాధితురాలి తల్లి కోరుతున్నారు. మిగిలిన

  కేసు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో దృశ్యాలు ప్రత్యక్షం

  కేసు పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో దృశ్యాలు ప్రత్యక్షం

  నాలుగు రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. అయితే ఆదివారం బాధితురాలి తల్లి.. తన కుమార్తెను సాయిరామ్‌, కార్తీక్‌, శ్రీరాంపవన్‌ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈవ్‌టీజింగ్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అత్యాచాయత్నం దృశ్యాలు మంగళవారం యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచారయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. అయితే కేసు పెట్టక ముందే ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారా, లేదా కేసు పెట్టిన తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా ఈ దృశ్యాలను పోస్ట్ చేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ప్రభుత్వ పరంగా ఆదుకొంటాం

  ప్రభుత్వ పరంగా ఆదుకొంటాం

  బాధితురాలిని ప్రభుత్వ పరంగా ఆదుకొంటామని కదిరి ఎమ్మెల్యే బాబురావు హమీ ఇచ్చారు.విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసి హింసించిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.సహ విద్యార్థినిపై అత్యాచారయత్నం సభ్య సమాజానికే సిగ్గుచేటన్నారు బాబురావు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a shocking incident, a degree student was molested by a friend of her friend in Kanigiri town of Prakasam district in the state of Andhra Pradesh. The barbaric incident was filmed by a group of friends of the accused in August and uploaded on social media in a bid to circulate it all over. A complaint has been filed against the accused namely, Karthik, Pawan, and Sai, who were involved in filming the whole incident.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more