• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కనిగిరి కీచక పర్వం వెనుక నిజాలు: వాళ్లందరి నేపథ్యం ఇదే, ఏడ్చిన నన్నపనేని..

|

కనిగిరి: అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే చాలు.. ఏదేదో ఊహించేసుకుంటారు. అసలు తనతో మాట్లాడిందంటేనే.. తానేదో కింగ్ అన్న స్థాయిలో పోజులు కొడుతుంటారు. ఈ అత్యుత్సాహామే వారిని తప్పుదారి పట్టిస్తోంది. యువతుల జీవితాలతో చెలగాటమాడుతోంది.

ట్విస్ట్: కనిగిరిఘటనలో లవర్‌ కీలకం: 'ఆ ముగ్గురిని ఎందుకు వదిలేశారు'?

ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలోను ఇదే జరిగింది. ఒకే కాలేజీ వాడని మాట్లాడిన పాపానికి.. అతిగా ఊహించుకున్న నిందితుడు సాయి, ఏకంగా యువతి జీవితాన్నే నాశనం చేయాలనుకున్నాడు.

కాళ్లు పట్టుకున్నానని వేడుకున్నా!:

కాళ్లు పట్టుకున్నానని వేడుకున్నా!:

తనపై అత్యాచారయత్నం సమయంలో ఆ యువతి చేసిన ఆర్తానాదాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఆ వీడియోలో నిందితుడిని యువతి బతిమాలుతున్న తీరు.. అతని చేష్టలకు నిస్సహాయురాలిగా మారిపోయిన వైనం ఎవరికైనా కంటతడి పెట్టించకమానదు.

ఆమె ఎంతలా ప్రాధేయపడుతున్నా.. కాళ్లు మొక్కుతానన్న నిందితుడు సాయి మాత్రం ఆమె పట్ల పాశవికంగా వ్యవహరించాడు. తాకరాని చోట్ల తాకుతూ.. ఆమెను వివస్త్రను చేయాలనుకున్నాడు. ఇదంతా తన సెల్ ఫోన్‌లో షూట్ చేస్తున్న మరో స్నేహితుడు కార్తీక్.. సాయిని మరింత ప్రోత్సహించాడు. అమ్మాయి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా 'పట్టుకో.. దాన్ని పట్టుకో..' అంటూ సాయిని ఉసిగొల్పి మరీ పైశాచికానందం పొందాడు.

  Kanigiri degree student case : అత్యాచార దృశ్యాలు యూట్యూబ్‌లో పెట్టిన మృగాళ్లు | Oneindia Telugu
  అతిగా ఊహించుకున్నాడు:

  అతిగా ఊహించుకున్నాడు:

  కనిగిరి పట్టణం శివనగర కాలనీలో బాధితురాలి కుటుంబం నివసిస్తోంది. ఆమె తల్లి కుట్టు మిషన్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ తమ కాలేజీలోనే చదువుకుంటుండటంతో అతనితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని కార్తీక్ అతిగా ఊహించుకున్నాడు. ఆమె వేరేవాళ్లతో మాట్లాడటం కూడా అతనికి ఇష్టం లేదు. అలా ఆమె వేరేవాళ్లతో ఎక్కువగా మాట్లాడుతుందన్న అనుమానం పెంచకున్నాడు.

  బలవంతంగా మొబైల్ లాక్కుని:

  బలవంతంగా మొబైల్ లాక్కుని:

  బాధితురాలి పట్ల అతిగా వ్యవహరిస్తూ వచ్చిన కార్తీక్.. ఒకరోజు ఆమె మొబైల్ లాక్కున్నాడు. ఆమె ఫోన్ లో ఫోటోలు, మెసేజ్ లు పరిశీలించడానికే ఆ పనిచేశాడు. బాధితురాలు ఎంత ప్రాధేయపడినా సెల్ ఫోన్ ఇవ్వలేదు. ఆ తర్వాత రెండు రోజులకు(అగస్టు 30) సెల్ ఫోన్ ఇస్తా రమ్మంటూ పట్టణ శివారు ప్రాంతానికి పిలిచాడు. దీంతో బాధితురాలు తప్పనిసరి పరిస్థితుల్లో తన స్నేహితురాలితో పాటు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది.

  అప్పటికే అక్కడ మాటువేసి:

  అప్పటికే అక్కడ మాటువేసి:

  బాధితురాలు అక్కడికి చేరుకునేసరికే కార్తీక్ తో పాటు సాయిరామ్‌, శ్రీరామ్‌ పవన్‌ అనే మరో ఇద్దరు అక్కడ ఉన్నారు. ఫోన్ ఇవ్వాల్సిందిగా బాధితురాలు కోరగా.. ఒక్కసారిగా కార్తీక్ అతని స్నేహితులు ఆమె మీద వేధింపులకు దిగారు. ఆమెను వివస్త్రను చేయాలని సాయిరాంను కార్తీక్ ఉసిగొల్పాడు. సాయిరాం ఈ దుశ్చర్యకు పాల్పడుతుండగా.. కార్తీక్ దాన్ని తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. దాదాపు అరగంట పాటు బాధితురాలికి నరకం చూపించారు.

  కుమిలిపోయిన బాధితురాలు:

  కుమిలిపోయిన బాధితురాలు:

  కార్తీక్ చేసిన కీచక పర్వాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తానే కుంగిపోయింది. అప్పటికీ కక్ష తీరని కార్తీక్.. బాధితురాలిని వేధిస్తున్న దృశ్యాలను స్నేహితులకు చూపించడం మొదలుపెట్టాడు. కొంతమందికి షేర్ కూడా చేశాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు మరింత కుమిలిపోయింది. చివరికి ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లోను దర్శనమివ్వడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.

  నిందితుల నేపథ్యం:

  నిందితుల నేపథ్యం:

  ఈ ఘటనలో బాధితురాలు, నిందితులంతా పేద, మధ్య తరగతి కుటుంబానికే చెందినవారే. బాధితురాలిని వేధించిన నిందితుడు సాయి తండ్రి కుట్టు మిషన్లు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మరో నిందితుడు కార్తీక్ స్వగ్రామం పొన్నలూరు. కూలీ నాలీ చేసుకుంటూ అతని తల్లిదండ్రులు డిగ్రీ చదివించారు. మరో నిందితుడు శ్రీరాం పవన్ తండ్రి కనిగిరి పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. గతంలో శ్రీరాం పవన్‌ మైనారిటీ తీరని అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించే ప్రయత్నం చేశాడు. బాధిత యువతితో పాటు ఆమెకు తోడుగా వెళ్లిన మరో యువతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

  నన్నపనేని పరామర్శ:

  మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం కనిగిరిలోని బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. బాధితురాలు తనపై వేధింపులు జరిగిన తీరు గురించి చెబతుండగా.. నన్నపనేని కన్నీరు పెట్టారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని బాధితురాలికి భరోసా ఇచ్చారు.

  English summary
  The Kanigiri police have arrested three youths for allegedly sexually assaulting a college student and then circulating a video of the girl's molestation
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more