వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెండర్లను రద్దు చేస్తూ పోతే నష్టం తప్ప లాభం లేదని జగన్ పై ఫైర్ అయిన కన్నా

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పాలన దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు . ఇక జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ . అవినీతి గురించి మాట్లాడటం తప్ప జగన్ చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు .

రాజన్న పాలన అంటే ఇదేనా అని జగన్ ను ప్రశ్నించిన కన్నా

రాజన్న పాలన అంటే ఇదేనా అని జగన్ ను ప్రశ్నించిన కన్నా

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలపడే వ్యూహాలతో పాటు అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు బీజేపీ నేతలు. ఇటీవల రాజన్న పాలన అంటే ఇది కాదని జగన్ మీద నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పుడు మరోసారి జగన్ పై మాటల తూటాలు పేల్చారు.విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాలనపై నిప్పులు చెరిగారు . ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు పట్టెడు అన్నం పెడితే , జగన్ మాత్రం పేదల పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతి నిర్మూలనపై జగన్ వి మాటలే తప్ప చేతలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు .

టెండర్ల రద్దుతో సాధించేది ఏంటి .. ఇసుక పాలసీపై కాలయాపన దేనికి అని ప్రశ్నించిన కన్నా

టెండర్ల రద్దుతో సాధించేది ఏంటి .. ఇసుక పాలసీపై కాలయాపన దేనికి అని ప్రశ్నించిన కన్నా

ఇక రాష్ట్రంలో తాజా పరిస్థితులపై మండిపడిన కన్నా పోలవరం టెండర్ల రద్దు, బందరు పోర్టు టెండర్ల రద్దు, ఇలా వరుసగా టెండర్లను రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు. రాష్ట్రంలో భావన నిర్మాణ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నా ఇసుక విధానంపై కావాలనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిస్తున్నారని కన్నా విమర్శలు గుప్పించారు .విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటుపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

అవినీతి ఆరోపణలే కానీ ఇంతవరకు చేసింది ఏమీ లేదని కన్నా మండిపాటు

అవినీతి ఆరోపణలే కానీ ఇంతవరకు చేసింది ఏమీ లేదని కన్నా మండిపాటు

రాజన్న పాలనను మళ్లీ తెస్తామని చెప్పుకున్న జగన్ కు అంత సీన్ లేదని ఆయన క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కన్నా పేర్కొన్నారు .అవినీతి ఆరోపణలు తప్ప ఇప్పటి వరకు అవినీతి నిర్మూలనకు చేసింది ఏమీ లేదని ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ ను , సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక బీజేపీ ఏపీలో పుంజుకునే యత్నంలో భాగంగా అధికార పార్టీ తీరుపై స్పందిస్తోంది.

English summary
BJP's state unit president for Andhra Pradesh Kanna Lakshmi Narayana has made interesting comments on YS Jagan and YCP. Lakshminarayana spoke at vijayanagaram . Andhra Pradesh Chief Minister Jagan telling something and doing something . he told to the ap people he will bring the rajanna rajyam .. but this is not rajanna rajyam .. there is lot of difference between jagan and YSR Kanna stated.. He said they opposed the anti-people policies being taken by the AP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X