వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నుంచి ఆఫర్ కానీ, పవన్ కళ్యాణ్ చెప్పలేదు, మేమూ చెప్పలేదు: కన్నా

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో తమ పార్టీ బీజేపీ బలపడుతోందని, 2019లో టీడీపీతో పొత్తు తమ అధిష్టానం చూసుకుంటుందని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మంగళవారం సాయంత్రం మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా స్పందించారు.

చదవండి: మహేష్ కత్తిపై షాకింగ్ కామెంట్స్: 'తప్పు చేశా, అమ్మాయిల ఫోన్ నెంబర్లు అడిగాడు'

బీజేపీ తెలుగుదేశం పార్టీకి భయపడటం లేదని, ఏపీలో బలపడుతుందని చెప్పారు. టీడీపీకి తాము మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతామన్నారు. అందుకే ఎమ్మెల్సీ సోము వీర్రాజు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని చెప్పారు.

బీజేపీ వల్ల టీడీపీకి ఉపయోగం

బీజేపీ వల్ల టీడీపీకి ఉపయోగం

బీజేపీ మిత్రపక్షంగా ఉండటం వల్ల టీడీపీకి ఉపయోగపడుతోందని, కాని వారికి ఆ ఆలోచన లేదని కన్నా అన్నారు. తాము బలంగా మారే విషయం పక్కన పెడితే, అసలు తాము బలపడటమే టీడీపీకి ఇష్టం లేదన్నారు. తాము ఎక్కడ బలపడతామో అనే ఆవేదన టీడీపీకి ఉందన్నారు. అందుకే తన పేరు, పురంధేశ్వరి వంటి వారు వచ్చాకే టీడీపీని టార్గెట్ చేస్తున్నారని వారు అంటున్నారని చెప్పారు.

కన్నా నోట జగన్ మాట

కన్నా నోట జగన్ మాట


బీజేపీలో చేరి తాము తప్పు చేశామని తాము ఎప్పుడూ భావించలేదని కన్నా అన్నారు. ఏపీపై అధిష్టానం పెద్దగా దృష్టి పెట్టడం లేదనే భావన తమకు ఉందని, కానీ సరైన సమయంలో దృష్టి పెడుతుందన్నారు. బీజేపీకి ఏపీలో ఓటు బ్యాంకు ఉందన్నారు. 2014లో టీడీపీ, వైసీపీ మధ్య గెలుపుకు కేవలం నాలుగైదు లక్షల ఓట్లు మాత్రమేనని, కాబట్టి బీజేపీ వల్లే టీడీపీ గెలిచిందని చెప్పారు. తమకు, టీడీపీకీ మధ్య 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా అని జగన్ పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు అదే మాట కన్నా చెప్పారు.

కార్యకర్తల్లో అలాంటి భావన

కార్యకర్తల్లో అలాంటి భావన

టీడీపీతో పొత్తుపై తమ అధిష్టానం చూసుకుంటుందని కన్నా చెప్పారు. తమ నిర్ణయం అడిగితే తాము చెబుతామన్నారు. జన్మభూమి కమిటీ నుంచి సంక్షేమ పథకాల వరకు బీజేపీకి అవమానం జరుగుతోందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు టీడీపీతో ఉండాలని లేదన్నారు. తాము ప్రభుత్వంలో ఉన్నామనే భావ కార్యకర్తలలో లేదన్నారు. సందర్భం వచ్చినప్పుడు తాము అధిష్టానికి చెబుతామన్నారు.

వైసీపీ, టీడీపీల నుంచి ఆహ్వానం, చనిపోయేదాకా

వైసీపీ, టీడీపీల నుంచి ఆహ్వానం, చనిపోయేదాకా

బీజేపీ వాపును చూసి బలుపు అనుకోవడం లేదని కన్నా చెప్పారు. తాము వాస్తవాల మీద పని చేస్తున్నామని, కలల్లో పని చేయడం లేదన్నారు. తనకు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఆహ్వానం, ఒత్తిడి ఉందని చెప్పారు. కానీ తాను మోడీ నాయకత్వంలోనే చనిపోయేదాకా పని చేస్తానని చెప్పారు.

ఆఫర్ చేసే అవకాశం ఇవ్వలేదు

ఆఫర్ చేసే అవకాశం ఇవ్వలేదు


అధికారం కోసం తాను వైసీపీ లేదా టీడీపీలో చేరనని కన్నా చెప్పారు. తాను పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. వైసీపీ, టీడీపీలు తన వద్దకు వస్తే బీజేపీలోనే ఉంటానని చెప్పానని, ఇక అలాంటప్పుడు తనకు ఆఫర్ చేసే అవకాశమే వారికి ఇవ్వలేదన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పలేదు

పవన్ కళ్యాణ్ చెప్పలేదు

ప్రాంతీయ పార్టీలు కుల సమీకరణాల మీద ఆధారపడతాయని, కానీ జాతీయ పార్టీలు అలా పని చేయవని కన్నా చెప్పారు. 2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు అండగా నిలబడ్డారని, ఇప్పుడు తాను ఎన్డీయేలో లేనని పవన్ చెప్పడం లేదని, పవన్ లేడని తాము చెప్పడం లేదని చెప్పారు.

English summary
BJP leader Kanna Laxminarayana about Pawan Kalyan, YS Jagan and TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X