వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కేజ్రీవాల్ అంశాన్ని సాకుగా చూపి చంద్రబాబు నీతి అయోగ్ సమావేశం బహిష్కరణ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అతిగా స్పందిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కేజ్రీవాల్ అంశాన్ని సాకుగా చూపి నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తారన్నారు.

ఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్‌ను కలిసేందుకు చంద్రబాబు-మమతలకు నో, భార్యతో భేటీఢిల్లీలో హైడ్రామా: కేజ్రీవాల్‌ను కలిసేందుకు చంద్రబాబు-మమతలకు నో, భార్యతో భేటీ

ఢిల్లీలో చంద్రబాబు చేస్తున్న హడావుడి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిని తలపిస్తోందని మండిపడ్డారు. ఆయన ఏపీలో పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువ అయ్యాయన్నారు. టీడీపీ నేతలు నిందితులకు కొమ్ము కాస్తున్నారని చెప్పారు.

Kanna Laxminarayana lashes out at CM Chandrababu Naidu for supporting Kejriwal

ఢిల్లీలో ఇటీవల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆకుల సత్యనారాయణల భేటీపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా కన్నా స్పందించారు. తమ పార్టీ నేత ఆకులను పరామర్శించేందుకే బుగ్గన వచ్చారని చెప్పారు. ఇతరులకు నీతులు చెప్పే పరిస్థితి యనమల రామకృష్ణకు ఉందా అని ఎద్దేవా చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ద్రోహం చేసిన చంద్రబాబు పంచన యనమల చేరారన్నారు.

English summary
BJP Andhra Pradesh chief Kanna Laxminarayana lashes out at CM Chandrababu Naidu for supporting Delhi Chief Minister Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X