వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు రిజర్వేషన్ బిల్లుపై మోడీకి లేఖ రాసిన ముద్రగడ ... ఏమి అడిగారంటే

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ సమస్యగా మారింది కాపుల రిజర్వేషన్‌ అంశం . దీనికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . పలు ఆందోళనలకు, విమర్శలకు తావిచ్చాయి. ఇక, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సైతం కాపు రిజర్వేషన్ అంశంపై శాసన సభా వేదికగా సాధ్యం కాదన్న విషయం చెప్పటంతో కాపుల్లో కొంత మేరకు ఆందోళన నెలకకొంది. అయితే, ఈ సమస్యపై కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లు ఆమోదించి కాపులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే అగ్రవర్ణాల పేదల 10% రిజర్వేషన్ లో 5% కాపులకు కల్పించాలని కేంద్రానికి లేక ద్వారా నివేదించారు ముద్రగడ పద్మనాభం.

<strong>టీడీపీ నేతకు చెందిన మూడు ఇళ్ళు ధ్వంసం ..నెల్లూరులో ఉద్రిక్తత</strong>టీడీపీ నేతకు చెందిన మూడు ఇళ్ళు ధ్వంసం ..నెల్లూరులో ఉద్రిక్తత

కాపు రిజర్వేషన్ కోసం మోడీకి లేఖ ... చంద్రబాబు పంపిన రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కోరిన ముద్రగడ

కాపు రిజర్వేషన్ కోసం మోడీకి లేఖ ... చంద్రబాబు పంపిన రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కోరిన ముద్రగడ

కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ కు కాపు రిజర్వేషన్ అంశామపై బహిరంగ లేఖ రాశారు. ఇక తాజాగా కేంద్రానికి సైతం లేఖ రాసి కాపు రిజర్వేషన్ డిమాండ్ ను మరోసారి తెరమీదకు తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పై దృష్టి సారించాలని లేఖ రాశారు. 02.12.2017న అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన తన లేఖ ద్వారా మోడీకి విజ్ఞప్తి చేశారు. గత యాభై సంవత్సరాలుగా ఆంధ్రాలో రాజకీయ పక్షాలు తమ ఓట్లు పొంది, రాజకీయంగా లబ్ది పొందారని కానీ రిజర్వేషన్ విషయంలో మోసం చేశారని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. తక్షణం బిల్లును ఆమోదించి కాపు రిజర్వేషన్ అమలుకు కేంద్రం సహకరించాలని లేఖలో మోదీకి ముద్రగడ విజ్ఞప్తి చేశారు.

 వైసీపీ అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని కోరిన ముద్రగడ

వైసీపీ అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని కోరిన ముద్రగడ

ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలిన్నాళ్ళలో కూడా అయన జగన్ కు లేఖ రాశారు. ఎపి ముఖ్యమంత్రి జగన్‌ కు బహిరంగ లేఖ రాసిన ముద్రగడ కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌ పై ఉందని తెలిపారు. చంద్రబాబు పూర్తి చేయకుండా వదిలేసిన కాపులకు 5 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని, దానికోసం చొరవ చూపాలని సిఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఉన్నత వర్గాల్లోని పేదలకు కేంద్రం ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలయ్యేలా చూడాలని తన లేఖలో సిఎం జగన్‌ ను ముద్రగడ పద్మనాభం కోరారు.

కాపు రిజర్వేషన్ బిల్లు విషయంలో వైసీపీ స్పష్టత .. కేంద్రం ఇచ్చే ఈబీసీ కోటాలో సాధ్యం కాదన్న ఏపీ ప్రభుత్వం

కాపు రిజర్వేషన్ బిల్లు విషయంలో వైసీపీ స్పష్టత .. కేంద్రం ఇచ్చే ఈబీసీ కోటాలో సాధ్యం కాదన్న ఏపీ ప్రభుత్వం

ఇక జగన్ సర్కార్ మాత్రం ముద్రగడ కోరినట్టు, చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ సాధ్యం కాదని తేల్చేశారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం అందినే 10 శాతం రిజర్వేషన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా కచ్చితంగా వ్యవహరిస్తుంది . గతంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఈ కోటాలో భాగంగా ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్ల అమలు నిలిపోయినట్లయింది.

English summary
In a letter to Prime Minister Narendra Modi, the Kapu Movement leader Mudragada Padmanabham should focus on Kapu reservation. He appealed to Modi through his letter to accept the 33/2017 reservation bill passed by the Chandrababu Naidu government in the Assembly on 02.12.2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X