వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"పరిటాల హత్య బాబుకు ముందే తెలుసు, వైఎస్ కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు"

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్బంగా మాట్లాడిన ముద్రగడ.. చంద్రబాబు పాలనంతా కులాలతోనే ముడిపడి ఉందన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.

సాధారణ ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల పోస్టుల దాకా ప్రతీ స్థాయిలో తన కులం వాళ్లకే చంద్రబాబు పెద్ద పీట వేశారని ఆరోపించారు ముద్రగడ. గతంలో ఉన్న కులపిచ్చితో పోలిస్తే చంద్రబాబులో ఇప్పుడది వెయ్యి రెట్లు కనిపిస్తోందన్నారు. ఉద్యోగాలన్నింటిని చంద్రబాబు తన కులస్తులతోనే నింపుతూ పోతున్నారని ఆరోపిపంపచిన ఆయన.. పోస్టింగుల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

ఇక్కడున్న వాళ్లు సరిపోవడం లేదన్నట్లు.. పక్క రాష్ట్రాల నుంచి కమ్మ కులస్తులను తీసుకొచ్చి మరీ చంద్రబాబు వారికి పదవులు కట్టబెడుతున్నారని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కులానికి చెందిన లక్షాధికారులను కోటీశ్వరులు గాను, కోటీశ్వర్లను పరమ కోటిశ్వర్లుగాను మార్చే పనిలో చంద్రబాబు నిమగ్నపోయాడన్నారు. ఇలా అక్రమంగా కూడబెట్టే డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఖర్చులను ప్లాన్ చేసుకుంటున్నారని చంద్రబాబును విమర్శించారు.

అధికారంలో ఉన్నవాళ్లు కులపిచ్చికి దూరంగా ఉంటేనే మిగతా కులాలకు ఆ జాడ్యం అంటకుండా ఉంటుందన్నారు. ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఖర్చులన్నీ భరించింది నారాయణే కాబట్టి ఆయనొక్కరికి మాత్రం చంద్రబాబు కులపిచ్చి నుంచి మినహాయింపు లభించిదన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున మంత్రి నారాయణ రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని అందుకే చంద్రబాబు ఆయనకు తగిన గౌరవమిస్తున్నారన్నారు.

Mudragada Padmanabham

పరిటాల హత్య బాబుకు ముందే తెలుసు :

అప్పటి పరిటాల రవి హత్య విషయాన్ని గుర్తు చేస్తూ.. పరిటాల హత్య జరుగుతుందన్న విషయం చంద్రబాబుకే ముందే తెలుసన్నారు ముద్రగడ. రవి హత్యను రాజకీయంగా ఉపయోగించుకునేందుకే ఆయనకు హత్యకు చంద్రబాబు అడ్డుపడలేదన్నారు. చంద్రబాబుకు కులపిచ్చే గనుక లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన పరిటాల రవిపై పోలీసులు కేసులు పెడితే.. నేరుగా అనంతపురం వెళ్లి ధర్నాలు ఎందుకు చేశారని నిలదీశారు.

జగన్ తో తనకు సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. జగన్ నుంచి సహాయం తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. బాలకృష్ణ కాల్పుల కేసులో వైఎస్ కాళ్లు పట్టుకుని బ్రతిమాలుకున్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆ విషయంలో చంద్రబాబు వైఎస్ నుంచి సహాయం పొందారని చెప్పుకొచ్చారు.

విధ్వంసాలు, కల్లోలాలు సృష్టించిడంలో చంద్రబాబును మించిన మహారాజు మరొకరు లేనే లేరన్నారు. 1984లో ఎన్టీఆర్‌కు చెందిన ఓ స్డూడియోలో కూర్చుని చంద్రబాబు, ఉపేంద్ర ఇద్దరూ.. బస్సులు ప్రభుత్వ కార్యాలయాల విధ్వంసానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

English summary
Kapu Leader Mudragada Padmanabham made some sensational comments on CM Chandrababu Naidu. 'chandrababu has too much cast feeling in his thats why all the posts were filling with kamma castre only'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X