వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌ను ఇర‌కాటంలోకి నెట్ట‌బోయి: కాపులు బీసీలా..ఓసీలా..తుని ఘ‌ట‌న‌లో : చ‌ంద్ర‌బాబు పై సీఎం రివ‌ర్స్

|
Google Oneindia TeluguNews

కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం పై ఏపీ అసెంబ్లీ దద్ద‌రిల్లింది. తాము ఈబీసీల్లో కాపుల‌కు అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తూ నిర్ణ‌యం చేసామ‌ని..అది కొన‌సాగిస్తారా అని ప్ర‌శ్నించ‌టం ద్వారా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టాల‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. అయితే ఆ ప్ర‌య‌త్నం రివ‌ర్స్ అయింది. వైసీపీ ఎదురుదాడికి ఒక సంద ర్భంలో నేను చేసింది మోస‌మే అయితే..వైయ‌స్ చేసింది ఏంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మీరు చేసిన ప‌నుల‌కు అస‌లు కాపులు ఇప్పుడు బీసీలా..ఓసీలా అనే సందిగ్దంలో ప‌డ్డార‌ని..చంద్ర‌బాబు కార‌ణంగా కోర్టులో కేసులు ప‌డి విద్యా ర్ధుల‌కు ఇబ్బందులు ఎదురువ‌తున్నాయంటూ జ‌గ‌న్ మండి ప‌డ్డారు. తాను మ‌న‌స్సాక్షిని చంపుకొని రాజ‌కీయాలు చేయ లేన‌ని జ‌గ‌న్ స‌భ‌లో తేల్చి చెప్పారు.

Recommended Video

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.. -మంత్రి కురసాల కన్నబాబు
కాపు రిజ‌ర్వేన్ల పైన స‌భ‌లో ర‌గ‌డ‌..

కాపు రిజ‌ర్వేన్ల పైన స‌భ‌లో ర‌గ‌డ‌..

బ‌డ్జెట్ పై చ‌ర్చ‌లో భాగంగా వైసీపీ స‌భ్యుడు అంబ‌టి రాంబాబు బ‌డ్జెట్‌లో కాపు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్య‌త‌ను వివ రించారు. కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని హామీ ఇచ్చి మోసం చేసార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తునిలో జ‌రిగిన రైలు ద‌హ‌నంలో పులివెందుల నుండి రౌడీలు వ‌చ్చి త‌గ‌ల‌బెట్టార‌ని ఆరోపించార‌ని..ఎవ‌రినీ ఎందుకు విచారించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇదే చ‌ర్చ‌లో మ‌రో ఎమ్మ‌ల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తుని ఘ‌ట‌న‌లో త‌న‌ను ఏ-2గా చేర్చార‌ని..రాయ‌ల‌సీమ నుం డి వ‌చ్చిన వారు రైలు ద‌హ‌నం చేస్తే..గోదావ‌రి జిల్లాలోని వారి పైన కేసులు ఎందుకు పెట్టార‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మోసం చేయ‌లేన‌ని..ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పార‌ని అందులో భాగంగానే బ‌డ్జెట్‌లో రెండు వేల కోట్లు కేటాయించార‌ని వివ‌రించారు.

జ‌గ‌న్ ను ఇరుకున పెట్టేందుకు బాబు య‌త్నం..

జ‌గ‌న్ ను ఇరుకున పెట్టేందుకు బాబు య‌త్నం..

ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు జోక్యం చేసుకొని 2004లో వైయ‌స్సార్ కాపుల‌ను బీసీల్లో చేర్చేందుకు హామీ ఇచ్చార‌ని.. 2009లో కూడా ఇదే హామీ ఇచ్చార‌ని గుర్తు చేసారు. తాము ఇచ్చిన హామీ మేర‌కు క‌మిటీ వేసామ‌ని..కేంద్రానికి పంపామ‌ని అయితే అక్క‌డ పెండింగ్ పడింద‌ని చెప్పుకొచ్చారు. దీంతో..ఈబీసీల్లో కాపుల‌ను అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు కు నిర్ణ‌యం చేసామ‌న్నారు. ఇప్పుడు మీ ప్ర‌భుత్వం ఈ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తారా లేదా అనేది ముఖ్య‌మంత్రి స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేసారు. దీనికి స్పందించిన జ‌గ‌న్ బీసీల్లో చేరుస్తామ‌ని మీరు హామీ ఇచ్చి కాపుల‌ను అన్ని ర‌కాలుగా మోసం చేసారంటూ అయిదేళ్ల కాలంలో బ‌డ్జెట్‌లో చేసిన కేటాయింపులు.. ఖ‌ర్చు గురించి వివ‌రించారు. దీనికి స్పంద‌న‌గా చంద్ర‌బాబు సైతం నేను చేసింది మోసం అయితే వైయ‌స్సార్ చేసిందీ మోస‌మే అని వ్యాఖ్యానించారు. త‌న డిమాండ్ పైన ముఖ్య‌మంత్రి స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని మ‌రో సారి డిమాండ్ చేసారు.

విరుచుకుప‌డిన ముఖ్య‌మంత్రి..

విరుచుకుప‌డిన ముఖ్య‌మంత్రి..

చంద్ర‌బాబు డిమాండ్ పైన జ‌గ‌న్ మండిప‌డ్డారు. కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌నే హామీ ఇచ్చి..ఈబీసీల్లో కాపుల‌కు 5 శా తం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చామ‌ని మ‌రో మోసం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు నిర్వాకం కార‌ణంగా కాపులు అస‌లు బీసీలా..లేక అగ్ర‌వ‌ర్ణాలా అనేది సందిగ్దంలో పడింద‌న్నారు. అగ్ర‌కుల్లాల్లో విడ‌దీసి అయిదు శాతం ఇవ్వ‌టం కుద‌ర‌ద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు చేసిన ప‌నికి ఇప్పుడు అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నార‌న్నారు. మెడిక‌ల్ కౌన్సిలింగ్ లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వివ‌రించారు. గ‌తంలో ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలోనూ ఇదే ర‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు లాగా త‌న‌కు మోసం..అబ‌ద్దాలు చేత‌కాద‌ని స్ప‌ష్టం చేసారు. మ‌న‌సాక్షిని చంపుకొని రాజకీయాలు చేయ‌న‌ని తేల్చి చెప్పారు. కాపుల‌ను మోసం చేసినందుకే గోదావ‌రి జిల్లాలో టీడీపీకి సీట్లు..ఓట్లు లేకుండా పోయాయ‌ని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. కాపుల‌ను ఇచ్చిన హామీ మేర‌కు బ‌డ్జెట్‌లో రెండు వేల కోట్లు కేటాయించామ‌ని..అన్ని రకాలుగా తోడుగా నిలుస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌కుండా..మాన‌వత్వం..మంచిత‌నం పెంచుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు.

English summary
Kapu Reservations issue created heat in AP Assembly. Chandra babu asked jagan is new govt implementing five percent reservations for Kapu community in EBC quota. CM jagan seriously reacted and cornered Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X